మరో పాన్ ఇండియన్ స్టార్ ని పట్టేసిన పూరీ.. ఈ సారి పొలిటికల్ థ్రిల్లర్.. రచ్చ షురూ!

తెలుగులో డాషింగ్ డైరెక్టర్ గా పేరున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చేసి ఫ్లాప్స్ అందుకున్నారు. అయితే చివరిగా రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ తో పొలిటికల్ థ్రిల్లర్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇస్మార్ట్ డైరెక్టర్

ఇస్మార్ట్ డైరెక్టర్


2015లో టెంపర్ సినిమా తో హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ ఆ తర్వాత అరడజను సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయారు. ఇక తన ట్రేడ్ మార్క్ అయిన మాస్ మసాలా జానర్ లో ఆయన చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఒకపక్క హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న రామ్ అలాగే పూరి జగన్నాథ్ ఇద్దరికీ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది.

లైగర్ తో బిజీ

లైగర్ తో బిజీ


ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చిన హిట్ తో పూరి జగన్నాథ్ ఏకంగా విజయ్ దేవరకొండను లైన్ లో పెట్టాడు. ఆయనతో బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక పూరి కనెక్ట్స్ బ్యానర్ ని పర్యవేక్షిస్తున్న ఛార్మి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకుంది.

యష్ తో పాన్ ఇండియా మూవీ

యష్ తో పాన్ ఇండియా మూవీ


అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పూరి జగన్నాథ్ పాన్ ఇండియా స్టార్ యష్ ని లైన్ లో పెట్టాడు అని తెలుస్తోంది. నిజానికి కేజీఎఫ్ సినిమా పూర్తయిన వెంటనే పూరి జగన్నాథ్ తో యష్ తో సంప్రదింపులు జరిపాడు. కానీ అప్పటికే కేజీఎఫ్ రెండో భాగం చేయాలని అగ్రిమెంట్ చేసుకుని తనకు ఇంకా సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. తాజాగా పూరి జగన్నాథ్ పంపిన స్క్రిప్ట్ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

పొలిటికల్ థ్రిల్లర్

పొలిటికల్ థ్రిల్లర్


ఇక ఇది పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. నిజానికి పూరి జగన్నాథ్ ఒక పొలిటికల్ థ్రిల్లర్ చేసి చాలా రోజులే అయింది. ఆయన నుంచి పొలిటికల్ థ్రిల్లర్ రాబోతుంది అని ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

Recommended Video

Liger Movie Team Planning For Surprise On Vijay Devarakonda Birthday || Filmibeat Telugu
అప్పుడు అధికారిక ప్రకటన

అప్పుడు అధికారిక ప్రకటన

నిజానికి ఇదే అంశం గురించి గతంలో ఒక ఛానల్ ప్రతినిధులు యష్ ను ప్రశ్నించారు కూడా. అప్పటికి యష్ కేజిఎఫ్ పార్ట్ వన్ పూర్తి చేసి ఉన్నారు. ఆ సందర్భంలో స్పందిస్తూ తాను ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు కానీ పూరి జగన్నాథ్ తో రెండు మూడు సార్లు సిటింగ్స్ కి కూర్చున్నాం అని అన్ని వర్కౌట్ అయితే తానే ప్రకటిస్తానని అప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చారు. త్వరలో ఒక మంచి ముహూర్తం చూసుకుని దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X