»   » పూరి...స్టోరీ వివాదం: 1 లక్ష మాత్రమే ఇచ్చాడట

పూరి...స్టోరీ వివాదం: 1 లక్ష మాత్రమే ఇచ్చాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ చిరంజీవి చేయబోయే ప్రతిష్టాత్మక 150వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అలా సినిమా ప్రకటన వచ్చిందో లేదో....ఇలా స్టోరీ కాపీ కొట్టారంటూ వివాదం తెరపైకి వచ్చింది. పూరి మాత్రం స్టోరీ నాదే అంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఆ వివాదంపై రైటర్స్ అసోసియేషన్లో ఉంది.

కాగా... పూరి జగన్నాథ్ గురించి మరో వార్త హాట్ టాపిక్ అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘జ్యోతి లక్ష్మి' చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ‘మిసెస్ పరాంకుశం' నవల ఆధారంగా తెరకెక్కించాను. ఈ సుప్రసిద్ధ నవలను ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసారు.

ఆ స్టోరీ లైన్ తీసకుని తనకు నచ్చిన విధంగా, ఈ ట్రెండుకు తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసారు పూరి. అయితే ఈ స్టోరీలైన్ తీసుకున్నందకు కేవలం రూ. 1 లక్ష మాత్రమే ముట్టజెప్పారట. ప్రస్తుతం సినిమా రంగంలో ఉన్న లెక్కల ప్రకారం ఇది చాలా చిన్న మొత్తం అంటున్నారు. ఇంతకు ముందు పూరి దర్శకత్వం వహించిన ‘టెంపర్' స్టోరీకి రూ. 1 కోటి వరకు చెల్లించినట్లు టాక్. జ్యోతి లక్ష్మి సినిమాకు, టెంపర్ చిత్రానికి చాలా తేడా ఉన్నప్పటికీ మరీ రూ. 1లక్ష ఏమిటి? అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

Puri paid just 1 lakh to own Jyothi Lakshmi story

ఛార్మి ముఖ్య పాత్రలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న సినిమా ‘జ్యోతి లక్ష్మి'. సి.కె.ఎంటర్టెన్మెంట్స్, శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ పతాకాలపై శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జ్యోతి లక్ష్మి' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల చేసారు.

జ్యోతి లక్ష్మి సినిమా యూత్ ఫుల్, ఎమోషనల్, రొమాంటిక్ మూవీ అని నిర్మాతలు అంటున్నారు. ఈచిత్రం ఆడియోను మే చివరి వారంలో విడుదల చేసి జూన్ మొదటి వారంలోగానీ, రెండో వారంలోగానీ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో చార్మి టైటిల్ రోల్ చేస్తుండగా, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

English summary
Rumours have that Puri Jagan paid just 1 lakh to own Jyothi Lakshmi story and has written adapted screenplay and new version dialogues for it.
Please Wait while comments are loading...