Pushpa The Rule: బన్నీ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. షూట్ అప్పటి నుంచే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం "పుష్ప: ది రూల్". మొదటిభాగం "పుష్ప: ది రైజ్‌"తో అల్లు అర్జున్, రష్మిక మందన్న, సమంత, ఫహద్ ఫాసిల్ కన్పించి, మ్యాజిక్ చేశారు. సినిమాలో బన్నీ వేషధారణ, భాష, డైలాగులు చెప్పే తీరుతెన్నులు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరికీ నచ్చడంతో సినిమా ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోనే "పుష్ప: ది రైజ్‌" మూవీ ప్రభావం ఎక్కువగా కన్పించింది. లీడ్ యాక్టర్స్ నటనపై విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పుడు అందరి దృష్టి "పుష్ప: ది రూల్" సీక్వెల్‌పై ఉంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి, తెరపైకి వస్తుందా ? అని ఆతృతగా చూస్తున్నారు.

ఇప్పటికే సినిమా షూటింగ్ పై పలు రూమర్లు రాగా, తాజా సమాచారం ప్రకారం "పుష్ప: ది రూల్" ఆగస్టు మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ షెడ్యూలు స్టార్ట్ కానుందట. వాస్తవానికి చిత్రీకరణ జూన్ లేదా జూలైలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ 'పుష్ప' మొదటి భాగం హిట్ అయ్యాక, ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్-2 వంటి భారీ సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా కేజిఎఫ్-2 మేనియాతో ప్రేక్షకులు ఊగిపోయారు. ఈ కారణంగా సీక్వెల్ గా తెరకెక్కనున్న "పుష్ప-2"పై అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Pushpa The Rule shooting may start from august third week

అందుకే మేకర్స్ సినిమా స్క్రిప్ట్ ను ఛేంజ్ చేసినట్టు ప్రచారం జరిగింది. అందుకే సుకుమార్ ఆగస్టు వరకు సినిమా షూటింగ్ ను వాయిదా వేశాడని టాక్. ఇక ఇప్పుడు సుకుమార్ రెండవ భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను దాదాపు పూర్తి చేసాడు. అల్లు అర్జున్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి చాలా మార్పులు చేసాడు. జనవరి 2023లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా హీరోయిన్ గా రష్మిక మందన్న కాకుండా మరో బ్యూటీని ఎంపిక చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే ఆసక్తికరమైన కథనాలు వస్తున్నాయి. మరోవైపు రష్మిక మందన్న హీరోయిన్ గా కొనసాగుతుందని అంటున్నారు. ఫాహద్ ఫాసిల్ సోదరిగా మరో హీరోయిన్ కనిపించనుందని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని కూడా అంటున్నారు. నిజానికి విజయ్ సేతుపతి డేట్స్ సమస్య కారణంగా మొదటి భాగాన్ని మిస్సయ్యాడు. విజయ్ సేతుపతితో పాటు మరో విలన్ ను కూడా 'పుష్ప' రెండవ భాగంలో అల్లు అర్జున్ ఎదుర్కోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X