»   »  కోత: ఎన్టీఆర్ ‘టెంపర్’లో వేలుపెడుతున్న పివిపి?

కోత: ఎన్టీఆర్ ‘టెంపర్’లో వేలుపెడుతున్న పివిపి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్. ఫిబ్రవరి 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాపై ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత, ఫైనాన్సియర్ అయిన ప్రసాద్ వి పొట్లూరి(పివిపి) ఇటీవల ఈ చిత్రాన్ని చూసారని, కొన్ని మార్పులు చేయడంతో పాటు, పలు సీన్లు తీసేయాలని సూచించారట. ఇంతకీ పివిపికి ఈ సినిమాకు సంబంధం ఏమిటంటారా?... ‘టెంపర్' చిత్రానికి మేజర్ ఫైనాన్సియర్ ఈయనే అని టాక్.

 PVP has suggested some changes in Temper

వేరే ఆప్షన్ లేక పోవడంతో పివిపి సూచనల మేరకు దర్శకుడు పూరి, నిర్మాత గణేష్ మార్పులు చేయడానికి రెడీ సిద్ధమయ్యారట. ఆయన మాట వినకపోతే సినిమా విడుదల సమయంలో ఏదో ఒక ఇబ్బంది పెడతారని బండ్ల గణేష్ భయ పడుతున్నారని చర్చించుకుంటున్నారు. ఇటీవల ‘ఐ' సినిమాకు ఫైనాన్స్ చేసిన పివిపి విడుదల సమయంలో కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆడియో విడుదల తర్వాత ‘టెంపర్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్. ఈ ఇద్దరి హధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయంటున్నారు. వక్కతం వంశీ అందించే కథలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. టెంపర్ కూడా మంచి విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఈచిత్రం అత్యధిక ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
Film Nagar source said that, Prasad V Potluri watched the final cut of Temper and has suggested some changes in the film. PVP is the major financier for ‘Temper’.
Please Wait while comments are loading...