»   » బాలకృష్ణ తో PVP చిత్రం...డిటేల్స్

బాలకృష్ణ తో PVP చిత్రం...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : లెజండ్ హిట్ తో ఉత్సాహంగా ఉన్న బాలకృష్ణ తో ప్రముఖ నిర్మాణ సంస్ధ PVP వారు చిత్రం చేయనున్నారని సమాచారం. భారీగా రూపొందే ఈ చిత్రం బాలకృష్ణ వందో చిత్రం అని తెలుస్తోంది. సింహా తర్వాత వరస ఫ్లాపులతో ఉన్న బాలయ్య ..వందో చిత్రం దర్శకుడుపై డైలమాలో ఉన్నారు. అయితే లెజండ్ హిట్ తో బోయపాటి శ్రీను కే వందో చిత్రం దర్శకత్వం అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ఈ కాంబినేషన్ తో ఖచ్చితంగా ఎక్సపెక్టేషన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. ఈలోగా బాలకృష్ణ మరో రెండు చిత్రాలు పూర్తి చేస్తారు.

విజయోత్సాహంలో ఉన్నారు బాలకృష్ణ. ఆయన నటించిన 'లెజెండ్‌' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అభిమానులను అలరిస్తూ చక్కటి ఆదరణ పొందుతోంది. దీంతో బాలయ్య ఖాతాలో మరో విజయం చేరినట్త్టెంది. తాజాగా మరొక కొత్త చిత్రానికి పచ్చజెండా వూపారాయన. సత్యదేవా దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు. ఎస్‌.ఎల్‌.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మించబోతున్నారు.

PVP to produce Balakrishna’s 100th film

మేలో చిత్రాన్ని ప్రారంభిస్తారు. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాము''అని చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బాలకృష్ణ 'లెజెండ్‌' విజయయాత్రలో ఉన్నారు.

ఇక పలువురు దర్శకులు బాలయ్యతో సినిమాలు రూపొందించినప్పటికీ బాలకృష్ణ అభిమానులు ఆశించినంత హిట్ ను ఇవ్వలేక పోయారు. వైవియస్ చౌదరి లాంటి నందమూరి కుటుంబ అభిమానులు తీసిన సినిమాలు కూడా బాలయ్య అభిమానులను రంజింప చేయలేక పోయాయి. అయితే కొంత కాలం విజయాలకు దూరంగా ఉన్న సమయంలో బోయపాటి "సింహా' సినిమాతో బాలయ్య అభిమానులకు పలావు పెట్టాడు. అంతటితో ఆగకుండా "లెజెండ్'' చిత్రంతో విందుభోజనం పెట్టాడు.

దాంతో బాలయ్య అభిమానులు బోయపాటిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతే కాదు మెగా ఫ్యామిలీ కథానాయకులు కూడా బోయపాటి తో సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నారు. గతంలో బాలయ్యతో బ్లాక్ బస్లర్స్ తీసిన దర్శకులు కోడి, బి.గోపాల్ ల తరహాలోనే బోయపాటి కూడా బాలయ్య సినిమా కెరియర్ లో రికార్డులు సృష్టించిన దర్శకుడిగా మిగిలి పోవడం ఖాయమని బాలయ్య అభిమానులు చెప్పుకుంటున్నారు.

English summary
Balakrishna’s 100th film will be produced by PVP cinema and Boyapati Sreenu will be directing the project. This will be the third project for Balakrishna and Boyapati, who scored big hits with ‘Simha’ and ‘Legend’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu