»   »  తల్లిగా రాశి?

తల్లిగా రాశి?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Raasi
బాల తారగా ప్రవేశించి తరువాత హీరోయిన్ అయి తన అంద చందాలతో తెలుగు తెరని వేడిక్కించిన అందం రాశి. 'శుభాకాంక్షలు' సినిమాతో కుర్రకారు ఆరాధ్య దేవతగా మారిన ఈ సుందరి దాదాపు పెద్ద హీరోలందరితో చేసింది.అవకాశాలు తగ్గుతున్నాయనగానే పెళ్లి చేసుకుంది. ఆ తరువాత మళ్లీ వెండితెర మీద కనిపించలేదు. తరువాతా టీవీలో కొద్ది రోజులు ఒక షోకి యాంకర్‌గా దర్శనమిచ్చి మాయమయ్యింది. పెళ్లి తర్వాత ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. స్థూలకాయం వచ్చేసింది. చిన్న వయస్సుకే పెద్దగా ఒళ్ళు పెరిగి పోవటంతో అవకాశాలు అడుగంటాయి. ఈలోగా భర్త శ్రీనివాస్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'మహారాజశ్రీ' అనే సినిమా తీసింది. అది పెద్ద ఫ్లాప్ కావడంతో అందులో పెట్టిన వాటా డబ్బులన్నీ పోయాయి. దాంతో రాశి ఆర్థికంగా కాస్త ఇబ్బందులకు గురవుతోంది.

ఈ నేపథ్యంలో మళ్లీ నటించి కాస్త డబ్బులు వెనకేసుకోవాలని ఆమె ఆలోచిస్తోంది. కాని తెలుగులో ఆఫర్స్ ఇచ్చే వాళ్ళు కవపడటం లేదు. దాంతో ఆమె ఒక తమిళ సినిమాలో నటించటానికి కమిట్ అయ్యిందిట. అదీ హీరో శ్రీరామ్‌కు తల్లి పాత్రలో. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోందిట. ఆ సినిమా దర్శకుడెవరు, అందులో శ్రీరామ్‌కి జోడీగా నటిస్తున్నదెవరనే సంగతులు ప్రక్కన పెడితే మొత్తానికి రాశి ముప్ఫై యేళ్లు నిండకుండానే హీరోకి తల్లిగా నటించేందుకు సిద్ధమవుతోందన్న వార్త షాక్ కి గురిచేసేదే. దాంతో కెరీర్ సవ్యంగా ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని...తమకు జీవనాధారం అయిన శరీరాన్ని పెరగకుండా వ్యాయామాలు అవీ చేసుకుంటూ కాపాడుకోవాలని రాశి పాఠం చెప్పినట్లయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X