twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "రేసు గుర్రం" హిట్టైనా...అల్లు అర్జున్ కి మనస్తాపం?

    By Srikanya
    |

    హైదరాబాద్: అల్లు అర్జున్ తాజా చిత్రం "రేసు గుర్రం" 1050 థియోటర్స్ తో ప్రపంచవ్యాప్తంగా మొన్న శుక్రవారం విడుదల అయ్యింది. మార్నింగ్ షోకే ఈ చిత్రం హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే ఓపినింగ్స్ సైతం అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ అన్న రీతిలో వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ క్రెడిట్ మొత్తం బ్రహ్మానందం కొట్టేస్తున్నాడు. కిల్ బిల్ పాండేగా చేసిన బ్రహ్మానందం ఎపిసోడ్ సినిమా చివరి ఇరవై నిముషాలు లేకపోతే ఈ రిజల్ట్ రాకపోను అని..ఇది పూర్తిగా బ్రహ్మి నిలబెట్టిన చిత్రం అని అంతటా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ హీరో అయినా బ్రహ్మానందం కే ఈ చిత్రం క్రెడిట్ పూర్తిగా వెళ్ళిపోతోంది. ఈ ప్రచారం బన్నీకి మనస్తాపం కలిగిస్తోందంటున్నారు. అతని ఆనందంపై నీళ్లు జల్లినట్లు అవుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు.

    ఇక ఈ చిత్రం కథ ఏమిటంటే.... అన్నదమ్ములైన రామ్(శ్యామ్),లక్ష్మణ్ అలియాస్ లక్కీ(అల్లు అర్జున్) చిన్నప్పటి నుంచి టామ్ అండ్ జెర్రీ తరహాలో కొట్టుకుంటూ ఎదుగుతారు. పెద్దయ్యాక ఎసిపి గా ఎదిగిన రామ్ ... తన నిజాయితీతో లోకల్ రాజకీయనాయకుడు శివారెడ్డి(రవికిషన్) కి సమస్యగా మారతాడు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం సంపాదిస్తాడు. దాంతో శివారెడ్డి అతన్ని అడ్డు తప్పించుకోవాలనుకుంటాడు. ఆ విషయం తెలిసిన తమ్ముడు లక్కీ ఏం చేసాడు. తన అన్నను ఎలా ఆ కుటిల రాజకీయనాయకుడు నుంచి రక్షించాడు...ఆ క్రమంలో కిల్ బిల్ పాండే(బ్రహ్మానందం) ఎలా ఉపయోగపడ్డాడు అన్నది మిగతా కథ. అలాగే...లక్కీ తొలిచూపులోనే ప్రేమలో పడిన స్పందన(శృతి హాసన్)ని ఎలా దక్కించుకున్నాడు...సినిమాలో సలోని పాత్ర ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    Race Gurram Success credit goes to Brahmanandam?

    స్టోరీ లైన్ గా సునీల్, నాగచైతన్య నటించిన 'తడాఖా' గుర్తుకు వచ్చినా దాన్ని విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్, కామెడీ సన్నివేశాలతో మైమరిపించగలిగారు. ఫక్తు కామెడీ వ్యవహారం కావటంతో ట్విస్ట్ లు లేకపోవటమే కలిసివచ్చింది. 'కిక్' చిత్రం తరహాలో పూర్తిగా కామెడీతో చిత్రాన్ని పరుగెత్తించాలన్న దర్శకుడు నిర్ణయం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఫస్టాఫ్ లో ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ రాసుకున్న సీన్స్ కూడా నీట్ గా ఉన్నాయి. కిల్ బిల్ పాండే గా బ్రహ్మానందం మరోసారి విజృంభించాడు. అలీ.. 'బాలీ ఫ్రమ్ మలేషియా'(కిక్ లో పాత్ర కంటిన్యూషన్) గా బాగా నవ్వించాడు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా డిజైన్ చేసారు అదే సినిమాకు కలిసి వచ్చిందంటున్నారు.

    కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

    English summary
    Many started saying obviously that if Brahmanandam wouldn’t have entered Race Gurram movie as Kill Bill Pandey on the correct time,the audience would have run out of theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X