Don't Miss!
- News
Budget 2023: ధరలు తగ్గే- పెరిగే వస్తువులు ఇవే: వారికి బిగ్ షాక్..!!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Lifestyle
షుగర్ పేషంట్స్ ఉదయాన్నే ఈ ఆహారాలను తినకూడదు.. తింటే షుగర్ లెవల్స్ పెరిగి, ప్రాణాలకే ప్రమాదం...
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రాధే శ్యామ్ డైరెక్టర్ మరో బిగ్ ప్లాన్.. డిజాస్టర్ వచ్చినా మళ్ళీ స్టార్ హీరోతోనే..
ఈ ఏడాది ప్రభాస్ నుంచి వచ్చిన రాధే శ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లవ్ అడ్వెంచర్ మూవీగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పకుండా సక్సెస్ అవుతుంది అని ఫ్యాన్స్ కూడా ఎంతగానో నమ్మారు. దర్శకుడు రాధాకృష్ణ కూడా ఈ సినిమా కోసం దాదాపు రెండున్నర ఏళ్ళు కష్టపడడం అలాగే అంతకుముందు స్టోరీ కోసం ఎన్నో ఏళ్లుగా హార్డ్ వర్క్ చేయడం గురించి కూడా చెప్పడంతో అందరూ కూడా సినిమాపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు.
కానీ విడుదల తర్వాత సినిమా దారుణమైన రిజల్ట్ అందుకున్న విషయం తెలిసిందే. సినిమా ఏ మాత్రం కనెక్ట్ కాకపోవడంతో చాలా వరకు సినిమా నష్టపోవాల్సి వచ్చింది. దాదాపు ఈ ఏడాది అత్యధిక నష్టాలు కలిగించిన సినిమాల్లో రాదేశ్యామ్ ఒకటిగా నిలిచింది. అయితే ఈ మూవీ దర్శకుడు రాధాకృష్ణ ఆ తర్వాత మళ్లీ ఎక్కడ కూడా కనిపించలేదు. సోషల్ మీడియాలో కూడా తను చాలా తక్కువగా రియాక్ట్ అవుతున్నాడు. ఒకవేళ ఏదైనా విషయం పై స్పందించిన కూడా ఎవరు కామెంట్స్ చేయకుండా ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నాడు.

అయితే ప్రస్తుతం రాధాకృష్ణ మరొక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా తమిళ స్టార్ట్ హీరో ధనుష్ తో అతను సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తమిళ హీరో ధనుష్ తో కలిసి ఇదివరకే రాధాకృష్ణ ఒక స్టోరీ లైన్ గురించి చర్చించినట్లు సమాచారం. ధనుష్ కూడా రాధాకృష్ణ చెప్పిన లైన్ పై ఆసక్తి చూపించినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో స్టోరీ సిద్ధమైన తర్వాత మరోసారి చర్చిద్దాం అని కూడా ధనుష్ అతనికి మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ధనుష్ ఇప్పటికే తెలుగులో ఇద్దరు ప్రముఖ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఒప్పుకున్నాడు. వెంకీ అట్లూరితో సార్ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక రాధాకృష్ణ ఈ హీరోతో ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకువస్తాడో చూడాలి.