»   » లారెన్స్‌తో.... పవన్ కళ్యాణ్ సినిమా ఉత్తిదేనా?

లారెన్స్‌తో.... పవన్ కళ్యాణ్ సినిమా ఉత్తిదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘గంగ' సినిమా విజయంతో తెలుగు, తమిళ పరిశ్రమలో లారెన్స్ పేరు మార్మోగి పోతోంది. త్వరలో రాఘవ లారెన్స్ పవన్ కళ్యాన్, రజనీకాంత్ లతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంటే అని, ఇందులో నిజం లేదని తాజా ఓ వాదన తెరపైకి వచ్చింది. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

raghava lawrence

గంగ సినిమా విషయానికొస్తే...
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో కాంచన మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన కాంచన-2 (తెలుగులో ‘గంగ') చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను రాబట్టింది. కామెడీ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో రూ. 50 కోట్లు వసూలు చేసింది.

ఈ సినిమా విజయం సాధించడంతో...దీనికి సీక్వెల్ గా మరో సినిమా ‘ముని-3' చేయడానికి రెడీ అవుతున్నారు లారెన్స్. రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటించిన ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

English summary
Raghava Lawrence movie with Pawan Kalyan and Rajinikanth is fake news.
Please Wait while comments are loading...