For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గతంలో చూడని లుక్‌లో షాకిస్తోన్న బిగ్ బాస్ విన్నర్.. ఆ హీరోయిన్ కోసమే అంటున్నారే.!

  By Manoj Kumar P
  |

  సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించినప్పటికీ... బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిపోయాడు హైదరాబాదీ పోరడు రాహుల్ సిప్లీగంజ్. ప్లేబ్యాక్ సింగర్‌గా ఎన్నో అరుదైన ఘనతలను అందుకున్న అతడు... రియాలిటీ షో తర్వాత మరింత పాపులర్ అయిపోయాడు. దీంతో అతడు ఎక్కడికి వెళ్లినా.. ఎవరితో ఉన్నా.. ఏం చేసినా హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో పరిణామాలతో వార్తల్లో నిలిచిన రాహుల్.. తాజాగా సరికొత్త లుక్‌తో కనిపించి షాకిచ్చాడు. ఇది ఓ హీరోయిన్ కోసమే అని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే.....

  హాట్ టాపిక్ : రాహుల్ సిప్లిగంజ్‌కు పెళ్లైందా?.. సింగర్ నోయెల్ విషెస్‌ వైరల్

  జోష్‌ చూపించాడు.. భేష్ అనిపించుకున్నాడు

  జోష్‌ చూపించాడు.. భేష్ అనిపించుకున్నాడు

  సినిమాల్లోకి రాకముందు టీవీ ఛానెళ్లలో ప్రసారం అయిన పాటల పోటీల్లో పాల్గొన్నాడు రాహుల్ సిప్లీగంజ్. ఆ సమయంలో ఎన్నో అవార్డులను అందుకున్న అతడు... నాగ చైతన్య నటించిన ‘జోష్'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో అతడు పాడిన ‘కాలేజ్ బుల్లోడా' అనే పాట సూపర్ హిట్ అవడంతో వరుస ఆఫర్లు అందుకుని స్టార్ సింగర్‌గా ఎదిగిపోయాడు.

  వాటిలో మాత్రం రాహుల్‌కు తిరుగులేదంతే

  వాటిలో మాత్రం రాహుల్‌కు తిరుగులేదంతే

  ఒకవైపు సినిమాల్లో పాటలు పాడుతూనే.. ఇండిపెండెంట్ సింగర్‌గా పేరు తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే ప్రైవేట్ ఆల్బమ్స్‌ను రూపొందించడం ప్రారంభించాడు రాహుల్. ఈ క్రమంలోనే మొదట ‘మగజాతి' అనే మ్యూజిక్ వీడియో చేశాడు. అది హిట్ అవడంతో వరుసగా ‘ఎందుకే', ‘మంగమ్మ', ‘మైసమ్మ', ‘పూర్ బాయ్', ‘మాక్కికిరికిరి', ‘దూరమే' వంటివి రూపొందించాడు.

  బిగ్ బాస్‌లోకి ఎంట్రీ... నిజాయితీతో విజేతగా

  బిగ్ బాస్‌లోకి ఎంట్రీ... నిజాయితీతో విజేతగా

  కెరీర్‌పరంగా ఫుల్ జోష్‌లో ఉన్న సమయంలో ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్' సీజన్ -3లో పాల్గొన్నాడు రాహుల్. పద్నాలుగు మంది కంటెస్టెంట్లలో ఒకడిగా ఇంట్లోకి వెళ్లిన అతడు.. ప్రారంభంలో చెడ్డ పేరును మూటగట్టుకున్నాడు. దీంతో చాలా వారాల పాటు నామినేట్ అయ్యాడు. కానీ, నిజాయితీగా వ్యవహరిస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుని విజేతగా నిలిచాడు.

  హీరోయిన్‌తో ప్రేమ.. పెళ్లి కూడా చేసేశారు

  హీరోయిన్‌తో ప్రేమ.. పెళ్లి కూడా చేసేశారు

  బిగ్ బాస్ హౌస్‌లో తోటి కంటెస్టెంట్ అయిన తెలుగు హీరోయిన్ పునర్నవి భూపాలంతో రాహుల్ సిప్లీగంజ్ ప్రేమాయణం సాగించాడన్న టాక్ వినిపించింది. దీనికి కారణం హౌస్‌లో వీళ్లిద్దరూ వ్యవహరించిన తీరే. లోపల మాత్రమే కాదు బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, పెళ్లి కూడా చేసుకుంటారని అన్నారు.

  ఊహించని అవకాశం అందుకున్న రాహుల్

  ఊహించని అవకాశం అందుకున్న రాహుల్

  బిగ్ బాస్ విజేతగా నిలిచిన కారణంగానో.. యూత్‌లో ఉన్న క్రేజ్ కారణంగానో తెలియదు కానీ.. రాహుల్ సిప్లీగంజ్‌కు తన సినిమాలో నటించే అవకాశం కల్పించాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రంగమార్తాండ'. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్'కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో రాహుల్ కీలక పాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు.

  గతంలో చూడని లుక్‌తో షాకిస్తోన్నాడుగా

  తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను చూపెట్టే రాహుల్ సిప్లీగంజ్ సరికొత్త లుక్‌తో షాకిస్తున్నాడు. తాజాగా అతడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోలో గుండుతో కనిపించాడు. ‘ఇప్పుడు గుండు సమయం' అంటూ దానికి క్యాప్షన్ పెట్టాడు. గతంలో ఎన్నడూ చూడని లుక్‌తో అతడు దర్శనమివ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ పిక్ వైరల్ అవుతోంది.

  లుక్ ఆ హీరోయిన్ కోసమే అంటున్నారే.!

  లుక్ ఆ హీరోయిన్ కోసమే అంటున్నారే.!

  రాహుల్ సిప్లీగంజ్ లుక్ వెనుక రహస్యం ఇదేనంటూ ఓ వార్త అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ప్రస్తుతం ‘రంగమార్తాండ'లో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసమే రాహుల్ గుండుతో కనిపిస్తున్నాడట. అంతేకాదు, ఇందులో అతడికి జోడీగా జీవిత రాజశేఖర్ కుమార్తె శివాత్మక నటిస్తోంది. దీంతో రాహుల్ గుండు వెనుక ఆమె పాత్ర ప్రభావం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

  English summary
  Rahul Sipligunj is an Indian playback singer, songwriter, independent musician and actor. He became popular with his independent songs on YouTube. He is known for his Hyderabadi, Telangana slang songs. He has worked as a singer in over 50 Tollywood movies. He is the winner of Bigg Boss Telugu 3 show on Star Maa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X