»   »  రాజ్ తరణ్ 'సీతమ్మ అందాలు...' కథ ఇదే?

రాజ్ తరణ్ 'సీతమ్మ అందాలు...' కథ ఇదే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ,కుమారి 21 ఎఫ్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాందించుకున్న హీరో రాజ్ తరుణ్ . ఇదే ఊపులో ఈ శుక్రవారం శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు అంటూ వస్తున్నాడు . ఈ చిత్రం కథ అంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఓ స్టోరీ లైన్ నానుతోంది. దాన్ని మీకు అందిస్తున్నాం.

అందుతున్న సమచారం ప్రకారం ఈ చిత్రం అప్పట్లో జగపతిబాబు హీరోగా వచ్చిన కబడ్డి..కబడ్డి చిత్రాన్ని గుర్తు చేసే విధంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ చిత్రంలో కబడ్డి ప్లేసులో క్రికెట్ ని పెట్టారని చెప్తున్నారు. ఈ చిత్రంలోనూ హీరో తన ప్రేమను సాధించుకోవటానికి అవతలి వర్గంతో క్రికెట్ ఆడుతారని అంటున్నారు. నిజమా కాదా అనేది తెలియాలంటే ఈ శుక్రవారం వరకూ ఆగాల్సిందే.

Raj Tarun's Seethamma Andalu Ramayya Sitralu story line

నిర్మాతలు మాట్లాడుతూ....ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీటవేశాం. రాజ్‌తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రం ద్వారా అర్తన అనే నూతన హీరోయిన్‌ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నాం. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలను భారీ ఖర్చుతో చిత్రీకరించాం. సినిమాలో పతాక సన్నివేశాలు హైలైట్‌గా వుంటాయి. తప్పకుండా ఈ చిత్రం రాజ్‌తరుణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుంది అని తెలిపారు.

రాజ్‌తరుణ్, అర్తన, రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్ష్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్ :జేవీ, కెమెరా: విశ్వ, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.

English summary
Hero Raj Tarun’s Seethamma Andalu Ramayya Sitralu is all set for January 29th release worldwide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu