»   » 'అత్తారింటికి దారేది' ఎఫెక్ట్: రాజమౌళి జాగ్రత్తలు

'అత్తారింటికి దారేది' ఎఫెక్ట్: రాజమౌళి జాగ్రత్తలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' పైరసీ వ్యవహారం చాలా మంది దర్శక, నిర్మాతల కళ్లు తెరిపిస్తోంది. ముఖ్యంగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి పూర్తిగా జాగ్రత్త పడ్డాడని ఫిల్మ్ నగర్ టాక్‌. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్న 'బాహుబలికి' సంబంధించి ఏ ఒక్క లీకేజ్‌ లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్తున్నారు.

అందుకే రాజమౌళి కొత్త ప్రతిపాదనలు ప్రవేశ పెట్టారు. స్వతహాగా రాజమౌళి జాగ్రత్త పరుడు. కానీ అనుకోకుండా 'మగధీర' చిత్రీకరణ సమయంలో గుజరాత్‌లో జరిగిన గుర్రాల సీన్స్‌ అప్పట్లో లీక్‌ అయిన విషయం తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత మధ్య చిత్రీకరణను చేసి ఆయన ఈసారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యూనిట్‌ మొత్తానికి స్ట్రిక్ట్‌ రూల్స్‌ ఆదేశించాడని వినికిడి.

'బాహుబలి'కి సంబంధించి ఎడిట్‌ సూట్‌ పాస్‌వర్డ్‌ అన్ని తనకి అత్యంత సన్నిహితులకు, తన కుమారుడుకు మాత్రమే తెలిసేలా చేశారట. వారు వచ్చి సిస్టమ్స్‌ ఆన్‌ చేయగలిగితేనే టెక్నిషియన్స్‌ పని చేయగలిగేది. అలాగే షూటింగ్ సమయంలో సెల్ ఫోన్స్ ఎవరూ తీసుకోవటానకి వీల్లేదని ఆర్డర్స్ జారీ చేసారు. దాంతో తమ సినిమా సేఫ్ గా బయిటకు వస్తుందని భావిస్తున్నారు. దాంతో 'అత్తారింటికి దారేది' పైరసీ కొందరినీ ఒక్కసారిగా అలర్ట్‌ చేసినట్లుంది.

English summary
Rajamouli has been taking adequate measures to make sure the content of his upcoming film Bahubali is safe and secure. He passed certain guidelines to each and every member of the unit to avoid any leakages. That's the reason behind even actors refusing to reveal any minute detail about their roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X