»   » ప్రభాస్ ఆర్థిక పరిస్థితి తెలిస్తే షాకే.. చిల్లిగవ్వ లేకుండా.. రాజమౌళి వెల్లడించిన వాస్తవమిదే..

ప్రభాస్ ఆర్థిక పరిస్థితి తెలిస్తే షాకే.. చిల్లిగవ్వ లేకుండా.. రాజమౌళి వెల్లడించిన వాస్తవమిదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ కెరీర్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం కోసం దాదాపు ఐదేళ్లు మరే ప్రాజెక్టు అంగీకరించకుండా జాగ్రత్త పడ్డాడు. మరో చిత్రంపై కూడా దృష్టిపెట్టకుండా కేవలం బాహుబలి గురించే ఆలోచించాడు. అలాంటి అంకుఠిత దీక్షతో బాహుబలి కోసం పనిచేశాడు కాబట్టే ఏ నటుడికి దక్కని క్రెడిట్ ప్రభాస్‌కు దక్కుతున్నది. దేశ సినిమా చరిత్రలోనే 1000 కోట్ల హీరోగా ప్రభాస్ ఓ ఘనతను సాధించాడు. అయితే బాహుబలి షూటింగ్ జరిగిన సమయంలో ప్రభాస్ ఆర్థిక సమస్యలతో బాధపడ్డాడని దర్శకుడు రాజమౌళి ఇటీవల వెల్లడించినట్టు ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.

ప్రభాస్ ఆర్థిక పరిస్థితి దారుణం..

ప్రభాస్ ఆర్థిక పరిస్థితి దారుణం..

ఎన్నో సినిమాలు వదులుకొని బాహుబలి చిత్రం కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకొన్నాడో అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. అయితే అందుకు విరుద్దంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రభాస్ ఆర్థిక పరిస్థితి గురించి ఇటీవల దర్శకుడు రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బాహుబలి షూటింగ్ అప్పుడు..

బాహుబలి షూటింగ్ అప్పుడు..

బాహుబలి సినిమా షూటింగ్ జరుగుతున్న కాలంలో ప్రభాస్ డబ్బులు లేక ఇబ్బందికి గురయ్యాడట. మిర్చి చిత్రానికి ముందు రెండు హిట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రభాస్‌తో సినిమా తీయాలని పలువురు నిర్మాతలు చెక్కులు క్యూ కట్టారు. ప్రభాస్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకొన్న నిర్మాతలు భారీ ఆఫర్లతో ఇంటిముందు వాలియపోయారు. అంతేకాకుండా ఎలాంటి డిమాండ్ లేకుండా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడినారు అని రాజమౌళి చెప్పారు.

ఏం చేయాలో చెప్పు జక్కన..

ఏం చేయాలో చెప్పు జక్కన..

నిర్మాతలు వెంటపడుతున్న సమయంలో ప్రభాస్ నాకు ఫోన్ చేశాడు. ఏమి చేయాలో చెప్పమని సలహా అడిగాడు. అప్పుడు డబ్బులు తీసుకొని ఓ అఫిడవిట్ రాయించుకో. తీసుకొన్న మొత్తానికి సినిమాలు చేయడానికి ముడిపెట్టవద్దని క్లియర్‌గా చెప్పు అని సూచించాను. కానీ అందుకు ప్రభాస్ ఒప్పుకోలేదు. ఒకవేళ అంత మొత్తాన్ని తిరిగి ఇవ్వమని కోరితే ఎక్కడి నుంచి తీసుకురావాలి అని నిరాకరించాడు అని రాజమౌళి పేర్కొన్నాడని ఓ ఆంగ్ల వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది.

పది కోట్లు ఇస్తామంటే..

పది కోట్లు ఇస్తామంటే..

ఒక వ్యాపార ప్రకటనలో నటిస్తే రూ.10 కోట్లు ఇస్తామని ఓ సంస్థ ముందుకు వచ్చింది. అలాంటి భారీ ఆఫర్‌ను కూడా వదులుకొన్నాడు. ప్రభాస్ మాదిరిగా నిజాయితీగా వ్యవహరించే వారిని ఇప్పటివరకు చూడలేదు. అబద్ధం ఆడటం కూడా చాతకాదు. ఎదుటి వ్యక్తి మనసు గాయపడటం చూడలేడు. ఎవరినైనా ఇబ్బందికి గురి చేసే మనస్తత్వం కాదు అని రాజమౌళి వివరించినట్టు కథనంలో పేర్కొన్నది.

భావి ఇండియన్ సూపర్ స్టార్

భావి ఇండియన్ సూపర్ స్టార్

అంతగా బాహుబలికి అంకితమై నటించాడు కాబట్టే ప్రభాస్‌కు విశేషమైన పేరు వస్తున్నది. భావి ఇండియన్ సూపర్‌స్టార్ అనే ట్యాగ్‌ను యంగ్ రెబల్‌స్టార్‌కు జతచేస్తున్నారు. బాహుబలి1 సినిమా రూ.650 కోట్లు సాధించగా, ఐదురోజుల క్రితం రిలీజైన బాహుబలి2 అప్పుడే రూ.600 కోట్లను దాటేసింది.

English summary
Prabhas denied producer's cheques and cash for the entire time he shot for Baahubali: The Beginning and Baahubali: The Conclusion. Prabhas was pretty much penniless while shooting for Baahubali: The Beginning and Baahubali: The Conclusion. Recently, speaking to Telugu TV channel, SS Rajamouli talked about how Prabhas had no money while shooting for his film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu