For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ న్యూస్ : రాజమౌళి-ప్రభాస్ కొత్త చిత్రం బడ్జెట్

  By Srikanya
  |

  హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏమిటీ అంటే రాజమౌళి,ప్రభాస్ చిత్రం ఎలా ఉంటుంది...ఎలా ఉండబోతుంది..ఎంత బడ్దెట్ అనేది. అందులోనూ తాజాగా రాజమౌళి తన చిత్రం ఫోక్ స్టోరీలా ఉంటుందని,చారిత్రకం కాదని వివరణ ఇచ్చారు. మరో ప్రక్క తెలుగు,హిందీ భాషల్లో చేస్తానంటున్నారు. వీటిన్నటితో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపద్యంలో ఈ చిత్రం బడ్జెట్ అరవై కోట్ల రూపాయలనే విషయం బయిటకు వచ్చింది. మేజర్ గా ఈ చిత్రం కోసం భారీ సెట్స్, గ్రాఫిక్స్ ఖర్చు పెట్టనున్నారని సమాచారం.

  ఇక ఈ చిత్రం బాలీవుడ్ కి కనెక్టు అవుతుందా అంటే...ఎందుకు కాదు అంటున్నారు రాజమౌళి. ఆయన ..ఈ చిత్రం హీరో సెంట్రిక్ కాదని, ప్రభాస్ ఓ లీడింగ్ మ్యాన్ అని అంటున్నారు. అంటే మరో వెండితెర అద్బుతం జరగబోతోందనే సూచనలు ఇస్తున్నట్లే. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు. వారు గతంలో రాజమౌళి తో మర్యాదరామన్న చిత్రం తీసారు. నవంబర్ నుంచి ఈ చిత్రం ప్రారంభం కానున్నదని సమాచారం. ఈ చిత్రం కోసం తాను పెళ్లిని సైతం వాయిదా వేసానని ప్రబాస్ చెప్తున్నారు.

  "ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించబోయే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మా ఆర్కా మీడియా సంస్థ ఇటు సినిమా రంగంలోనూ, అటు టీవీ రంగంలోనూ ముందంజలో ఉండటం చాలా ఆనందంగా ఉంది'' అని నిర్మాత దేవినేని ప్రసాద్ అన్నారు. ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థపై దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ గతంలో 'వేదం', 'మర్యాదరామన్న' చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

  గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు. హై ఓల్టేజ్ తో కూడాని యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, డ్రామాతో కూడిన ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయింది. మూవీ లవర్స్‌కి ఈచిత్రం ద్వారా సరికొత్త అనుభూతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది.

  English summary
  
 
 Rajamouli next film film has been budgeted upto Rs 60 crores. Huge sets will be erected and the film will have lots of graphics. This film will be produced by Arka Media, which had produced Maryada Ramanna with Rajamouli. It would be made in Hindi and Telugu simultaneously. It will be a period film, but not a historical one. Prabhas has already been confirmed to do the hero's role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X