»   » హీరో నిర్మాతగా 'సూదు కవ్వుమ్‌' తెలుగు రీమేక్

హీరో నిర్మాతగా 'సూదు కవ్వుమ్‌' తెలుగు రీమేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన 'సూదు కవ్వుమ్‌' తమిళంలో చక్కటి ఆదరణ పొందింది. దీంతో ఆ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్‌ అవుతోంది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని రాజశేఖర్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో ఆయన నటించటం లేదని సమాచారం. కేవలం నిర్మాతగా వ్యవహించనున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని జె.డి చక్రవర్తి డైరక్ట్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. అలాగే కొత్తవాళ్లతో ఈ చిత్రం తీస్తారని వినపడుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంభందించిన ప్రకటన వచ్చే అవకాసం ఉంది. నలుగురు కిడ్నాపర్ల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది.

మరోప్రక్క ఇటీవల 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'తో భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న హిందీ దర్శకుడు రోహిత్‌ శెట్టి కన్ను సైతం 'సూదు కవ్వుమ్‌' పై పడింది. ఈ తమిళ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. అన్ని ప్రాంతాలకు తగ్గట్టుగా ఉండే ఆ కథపై తాజాగా హిందీ దర్శకుడు రోహిత్‌శెట్టి మనసుపడ్డాడట. ఆ చిత్రం రీమేక్‌ హక్కులను సొంతం చేసుకొన్న రాక్‌లైన్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి రోహిత్‌శెట్టి ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఇందులో హీరో,హీరోయిన్స్ గా ఇమ్రాన్‌ఖాన్‌, శ్రద్ధాకపూర్‌లను ఎంచుకొన్నట్టు ఆ సినిమావర్గాలు వెల్లడించాయి.

Rajashekar

మరో ప్రక్క రామ్ గోపాల్ వర్మ హీరో రాజశేఖర్ తో పట్టపగలు చిత్రం చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. పూర్తి హర్రర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని సైతం రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రంలో రాజశేఖర్ విభిన్నంగా తన నేచురల్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

పట్టపగలు అనే టైటిల్ తో చిత్రం చేస్తానని వర్మ చాలా కాలంగా భయపెడ్తున్నారు. అది త్వరలోనే మన ముందుకు రానుందని తెలుస్తోంది. దాదాపు 15 రోజులు రెగ్యులర్ షూటింగ్ లో ఈ చిత్రం ఫినిష్ చేసాడని,త్వరలోనే విడుదల చేస్తున్నాడని వినికిడి. ఈ మేరకు ఎడిటింగ్ వర్క్ ప్రారంభమయ్యిందని అంటున్నారు. అయితే మీడియాకు ఈ విషయం లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని మేనేజ్ చేసాడని,కొంతమంది మీడియా మిత్రలుకు తెలిసినా దాన్ని బయిటకు రానివ్వకుండా వర్మ రిక్వెస్ట్ చేసాడని అంటున్నారు. ఇద్దరూ ప్లాప్ లలో ఉన్నారు కాబట్టి హిట్ వచ్చే అవకాసం ఉందని అంటున్నారు.

English summary

 Tamil hit movie Soodhu Kavvum will be remade into telugu by film-maker JD Chakravarthy and Produced by Raja Shekar. The movie will go on the floors mid 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu