»   » ప్చ్... రజనీని..రాజమౌళి నిరాశపరిచాడు

ప్చ్... రజనీని..రాజమౌళి నిరాశపరిచాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. ఆయన హీరోగా రూపొందుతున్న 'లింగా' సినిమా కోసం రజనీకాంత్‌, దేవ్‌ గిల్‌పై రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన రైలు సెట్లో చిత్రీకరిస్తున్న ఈ పోరాట సన్నివేశానికి మాస్టర్‌ లీ నేతృత్వం వహిస్తున్నారు. అయితే హైదరాబాద్ షూటింగ్ లో ఆయన బాహుబలి షూటింగ్ ని దగ్గర నుంచి చూద్దామని ఆశపడ్డారని సమాచారం. అయితే బాహుబలి టీమ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. ప్రభాస్ కు సర్జరీ జరగటం, ఎండలు దృష్టిలో పెట్టుకుని రాజమౌళి బ్రేక్ ఇచ్చారు.

మైసూర్‌లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరపనున్నారు. ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా రూపొందించిన రైలు సెట్‌లో సన్నివేశాలను చిత్రిస్తారు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలందిస్తున్నారు.

Rajini 'Linga' shoot shift to RFC Hyderabad!

నిర్మాతలు మాట్లాడుతూ... ''రెండు తరాల వారధిగా సినిమా ఉండబోతోంది. రజనీకాంత్‌ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న పూర్తిస్థాయి యాక్షన్‌ తరహా చిత్రమిది. కె.ఎస్‌.రవికుమార్‌ చక్కటి కథతో ప్రేక్షకులను విస్మయపరచబోతున్నారు. రజనీ వైవిధ్య శైలి, కె.ఎస్‌.రవికుమార్‌ పాళి కలిసి సినిమా కొత్తగా ఉండబోతోంది'' అంటున్నారు.

మరోప్రక్క దక్షిణాదిలో తొలి చిత్రంతోనే బాలీవుడ్‌ నాయిక సోనాక్షి సిన్హాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 'లింగా'లోని నటనకుగాను రజనీ సహా చిత్రబృందమంతా పొగడ్తలతో ఆమెను ముంచెత్తిందట. ''దక్షిణాదికి కొత్త అయినప్పటికీ సోనాక్షి మెరుగైన నటనను ప్రదర్శిస్తోంది. తొలి టేక్‌లోనే సన్నివేశాలను పూర్తి చేసుకుంటోంది'' అంటూ యూనిట్ సోనాక్షిని పొగిడేస్తోంది.

చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు

English summary
Superstar Rajinikanth’s upcoming film ‘Linga’ shifted to RFC for a new schedule. KS Ravi Kumar is the director of the film. Rockline Venkatesh is the producer. Anushka and Sonakshi Sinha will be seen as female leads.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu