»   » రజనీ 'కబాలి' కథ కాపీనా, ఆ సినిమా నుంచే ఎత్తారా?

రజనీ 'కబాలి' కథ కాపీనా, ఆ సినిమా నుంచే ఎత్తారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరో గా పా రంజిత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'కబాలి'. ఈ చిత్రం తెలుగు టీజర్‌ రీసెంట్ గా విడుదలై అందరి మన్ననలూ పొందింది. ఎప్పటిలాగే తలైవా తనదైన స్టైల్‌, డైలాగ్‌ డెలివరీతో అదరగొట్టేయటం అందరికీ నచ్చేసింది.

ఈ టీజర్ విడుదలైన 22 గంటల్లోనే 50 లక్షలకు పైగా హిట్లు సంపాదించి రికార్డు సృష్టించగా...ఇప్పటివరకు ఈ టీజర్‌ను కోటీ 80 లక్షల మంది చూడటం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇండస్ర్టీలో చక్కర్లు కొడుతుంది. కబాలి ఇంగ్లీష్ మూవీ 'టేకెన్' కు ఫ్రీమేక్ అని చెప్తున్నారు.


2008లో విడుదలైన హాలీవుడ్ మూవీ 'టేకెన్' స్ఫూర్తితోనే 'కబాలి' రూపుదింది అనే వార్త వార్త చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. తన కూతుర్ని కిడ్నాపర్ల చెర నుండి రక్షించడానికి ఓ ఎక్స్ సర్పీస్ ఏజెంట్ జరిపిన పోరాటమే 'టేకెన్' మూవీ థీమ్. ఇందులో రొమాంటిక్ సీన్స్ ఏమీ ఉండవు.


Rajini's Kabali, Copy of 'Taken'?

కానీ, అండర్ వరల్డ్ మాఫియాతో మాజీ సిఐఏ ఏజెంట్ చేసే పోరాటమే ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఫ్రాన్స్, యు.ఎస్. మధ్య జరిగే ట్రాఫికింగ్ కూడా ఈ సినిమాలోని ప్రధానాంశం. నీసన్ హీరో గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తర్వాత ఈ సినిమాకు రెండు సీక్వెల్‌లు కూడా వచ్చాయి.


అయితే, కబాలి కూడా టేకెన్‌కు కథకు దగ్గరగానే ఉండబోతోందని చెప్తున్నారు. ఫస్టాఫ్ అంతా రజనీ సూపర్ హిట్ బాషాలాగ ఉంటుందని, తర్వాత సెకండాఫ్ లో కబాలి ఫ్లాష్ బ్యాక్ తర్వతా ఈ టేకిన్ ఛాయిలు కనపడతాయని అంటున్నారు. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కబాలి విడుదల వరకు వేచిచూడాల్సిందే.


ఇకపోతే, చెన్నైలో తొలి షెడ్యూల్‌ ముగించుకున్న 'కబాలి' యూనిట్‌ రెండో షెడ్యూల్‌ కోసం రెండ్రోజుల క్రితమే మలేషియాకు వెళ్లింది. కలైపులి ఎస్‌.థాను నిర్మాతగా పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కబాలి'లో రజనీకాంత్‌ డాన్‌ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.


Rajini's Kabali, Copy of 'Taken'?

సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన పాటలు మే 31న విడుదల కానున్నాయి. తమిళ ఆడియోని ఉదయం చెన్నైలో విడుదల చేసి, తెలుగు వెర్షన్‌ని అదే రోజు సాయంత్రం రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. రాధికా ఆప్టే రజనీకి జోడిగా నటించిన ఈ సినిమాని వి క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్.థాను. నిర్మించారు.


చైనాకు చెందిన విల్సన్‌ చౌ విలన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం మలేసియాలో జరిగింది. నిర్మాత మాట్లాడుతూ ''తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న చిత్రిమిది. సంతోష్‌ నారాయణ్‌ బాణీలు అందిస్తున్నారు. తెలుగులో సీతారామశాస్త్రి, చంద్రబోస్‌, అనంతశ్రీరామ్‌ సాహిత్యాన్ని అందిస్తున్నారు''అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాహితి, ఛాయాగ్రహణం:మురళీ, కళ: రామలింగం

English summary
Rajinikanth's most-anticipated film Kabali is buzzed to be inspired from Hollywood blockbuster Taken.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu