twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ ఫ్లాపు ఇచ్చినా...బిజినెస్ అదిరిపోతోందిగా

    By Srikanya
    |

    హైదరాబాద్: స్టార్ గా వెలుగుతున్న వారి చిత్రాలకు హిట్,ఫ్లాఫ్ లకు సంభంధం ఉండదని మరోసారి ప్రూవ్ అవుతోంది. రీసెంట్ గా రజనీ విక్రమ్ సింహా వంటి ప్లాఫ్ ఇచ్చినా ఆయన తాజా చిత్రం "లింగా" డబ్బింగ్ రైట్స్ కు మాత్రం ఎక్కడా తగ్గకుండా బిజినెస్ ఎంక్వైరీలు వస్తున్నట్లు సమాచారం. తెలుగులో ఈ చిత్రం రైట్స్ సంపాదించాలని పెద్ద నిర్మాతలు సైతం ట్రేడ్ ఎంక్వైరీలు చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రజనీ చిత్రం "శివాజి" తరహాలో ఇది ఘన విజయం సాధిస్తుందని అప్పుడే అంచనాలు వేస్తున్నారు. దాంతో దాదాపు 30 కోట్లు వరకూ ఈ రైట్స్ వెళ్లే అవకాసం ఉందని తెలుస్తోంది.

    రజనీకాంత్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. ఆయన హీరోగా రూపొందుతున్న 'లింగా' సినిమా కోసం రజనీకాంత్‌, దేవ్‌ గిల్‌పై రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన రైలు సెట్లో చిత్రీకరిస్తున్న ఈ పోరాట సన్నివేశానికి మాస్టర్‌ లీ నేతృత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలందిస్తున్నారు.

    Rajini's Lingaa copyrights quoted for 30crore

    నిర్మాతలు మాట్లాడుతూ... ''రెండు తరాల వారధిగా సినిమా ఉండబోతోంది. రజనీకాంత్‌ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న పూర్తిస్థాయి యాక్షన్‌ తరహా చిత్రమిది. కె.ఎస్‌.రవికుమార్‌ చక్కటి కథతో ప్రేక్షకులను విస్మయపరచబోతున్నారు. రజనీ వైవిధ్య శైలి, కె.ఎస్‌.రవికుమార్‌ పాళి కలిసి సినిమా కొత్తగా ఉండబోతోంది'' అంటున్నారు.

    మరోప్రక్క దక్షిణాదిలో తొలి చిత్రంతోనే బాలీవుడ్‌ నాయిక సోనాక్షి సిన్హాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 'లింగా'లోని నటనకుగాను రజనీ సహా చిత్రబృందమంతా పొగడ్తలతో ఆమెను ముంచెత్తిందట. ''దక్షిణాదికి కొత్త అయినప్పటికీ సోనాక్షి మెరుగైన నటనను ప్రదర్శిస్తోంది. తొలి టేక్‌లోనే సన్నివేశాలను పూర్తి చేసుకుంటోంది'' అంటూ యూనిట్ సోనాక్షిని పొగిడేస్తోంది.

    చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు

    English summary
    Talks are on for telugu dubbing rights of Rajinikanth's “Lingaa” and many have quoted more than Rs. 30crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X