రజనీకాంత్ డైరెక్ట్ తెలుగు సినిమా.. ప్రభాస్‌ను కాదని తలైవాతో మూవీ
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్ గా భారీ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ కూలీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే రోజు వార్ 2 చిత్రం కూడా విడుదల కావడంతో బాక్సాఫీస్ క్లాష్ జరిగింది. ఏదేమైనా రజనీకాంత్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద జోరుగానే వసూళ్లు అందుతుండటం విశేషం. ఇదిలా ఉంటే రజనీకాంత్ నెక్ట్స్ నటించబోయే చిత్రాలపై ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది. ఈమేరకు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
రజనీకాంత్ ఇప్పటికే దిలీప్ కుమార్ నెల్సన్ దర్శకత్వంలో కామెడీ యాక్షన్ డ్రామా జైలర్ చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంతో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. 210 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలవడంతో జైలర్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సంగం 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో తెలుగు నందమూరి నటసింహాం బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఇక జైలర్ 2 తర్వాత రజనీకాంత్ నటించబోయే చిత్రం ఏంటనేది ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది.

కాగా, రజనీకాంత్ ప్రస్తుతం డైరెక్ట్ తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఆ చిత్రానికి ఏకంగా టాప్ తెలుగు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నారని కోలీవుడ్, టాలీవుడ్ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే వీరి కాంబినేషన్ కు సంబంధించిన ప్రాజెక్ట్ విషయంలో చర్చలు కూడా జరిగాయని, స్క్రిప్ట్ వర్క్ కూడా నడుస్తోందని ప్రచారం. అయితే ఇప్పటికే ప్రభాస్ తో నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ పాన్ వరల్డ్ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. 2024లో విడుదలైన ఈ మైథలాజికల్ సైఫై చిత్రానికి పార్ట్ 2ని కూడా ప్రకటించారు.
అయితే ప్రస్తుతం ప్రభాస్ భారీ లైనప్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కల్కి 2898 ఏడీ సీక్వెల్ కు సంబంధించిన షూటింగ్ కోసం నాగ్ అశ్విన్ 14 నెలలుగా వెచి ఉన్నారు. కానీ ప్రభాస్ డేట్స్ మాత్రం దొరకడం లేదు. ప్రస్తుతం డార్లింగ్ ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నారు. ఈ ఏడాదంతా ఈ రెండు చిత్రాలకే సమయం సరిపోతుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగకు డేట్స్ ఇచ్చి ఉన్నారు. దీంతో మరో ఏడాది పాటు నాగ్ అశ్విన్ కు డేట్స్ దొరకడం కష్టంగానే మారింది.
ఈ క్రమంలో ఇప్పటికే నాగ్ అశ్విన్ ఏడాది పాటు వెయిట్ చేశారు. ఇక మరో ఏడాది సమయం వెచ్చించే ఓపికలేకపపోవడంతో ఇక రజనీకాంత్ తో సినిమా ఓకే చేయించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ - రజనీకాంత్ కాంబినేషన్ లో రాబోయే చిత్రానికి తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ ఫిల్మ్ బ్యానర్ వైజయంతి మూవీస్ నిర్మించబోతుందని ప్రచారం. ఇక మున్ముందు ఈ చిత్రంపై అప్డేట్స్ అందనున్నాయని సినీ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











