»   » హిట్ ఎఫెక్ట్: పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ఓంకార్ కు ఆఫర్

హిట్ ఎఫెక్ట్: పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ఓంకార్ కు ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఓ సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ కథే వేరు. ఆ దర్శకుడుకీ, టీమ్ కు వరస ఆఫర్స్ వస్తూంటాయి. ఇప్పుడు అలాంటిదే దర్శకుడు ఓంకార్ కు జరగబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ‘జీనియస్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్, తాజాగా మొదటి ప్రయత్నానికి భిన్నంగా ‘రాజుగారి గది' అంటూ హర్రర్ కామెడీతో మనముందుకు వచ్చారు.

అక్టోబర్ 22న దసరా కానుకగా ఈ సినిమా విడుదల అయిన ఈ చిత్రం నిన్న రిలీజైన మూడు చిత్రాల్లో బెస్ట్ అనిపించుకుంది. దాంతో ఇప్పుడు ఆయనకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్ వచ్చిందని సమాచారం. ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన అనీల్ సుంకర..ఈ దర్శకుడుని తన ఎకె ఎంటర్ట్నైమెంట్స్ బ్యానర్ లో మీడియం బడ్జెట్ లో ఓ చిత్రం చేయమని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


Raju Gari Gadhi effect: Ohmkar roped in by Top production house?

హిట్ టాక్ వస్తే డిస్త్రిబ్యూటర్స్ ఆ సినిమాకు పబ్లిసిటీ పెంచి, స్క్రీన్స్ సైతం పెంచుతూ మరింత బిజినెస్ చేయటానికి ప్రయత్నం చేస్తారు. తాజాగా అలాంటి ప్రయత్నమే ఈ దసరా కానుకగా విడుదలైన ‘రాజుగారి గది' చిత్రానికి చేస్తున్నారు చిత్రం పంపిణీదారులు అని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు నుంచి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రం స్క్రీన్స్ మరిన్ని పెంచనున్నారు.


భాక్సాఫీస్ వద్ద చెలరేగి,బి,సి సెంటర్లలలో డబ్బు తెస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. కామెడీ, హర్రర్ డోస్ ఫెరఫెక్ట్ గా మిక్స్ కావటమే సినిమాకు కలిసి వచ్చిందంటున్నారు.


ఈ దసరాకు ... ఓంకార్ ‘రాజుగారి గది' , క్రిష్ ...కంచె చిత్రం, సుమంత్ అశ్విన్ చిత్రం కొలంబస్ లు రిలీజ్ అయ్యాయి. మూడు చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. మూడు సినిమాలూ తమ ట్రైలర్స్ తో ప్రేక్షకులను థియోటర్స్ వరకూ లాక్కెళ్లినవే. ఈ మూడింటిలో రెండు ఓ మాదిరి బడ్జెట్ చిత్రాలు కాగా, కంచె మాత్రం హై బడ్జెట్ తో రూపొందింది.


చిత్రం కథేమిటంటే...


Raju Gari Gadhi effect: Ohmkar roped in by Top production house?

అన్ని దెయ్యాల సినిమాల్లో లాగానే ఈ సినిమాలోనూ ఓ పురాతన భవంతి. అందులోకి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రారంటూ...భవంతి గురించి భయపెట్టే రకరకాల కథలు. ఈ భవంతి ని బేస్ చేసుకుని మా టీవి ఛానెల్ వారు ...దెయ్యంతో ఏడు రోజులు..గెలిస్తే..3 కోట్లు అనే రియాలటీ షో పోగ్రాం పెడుతుంది. ఆ షో లో పాల్గొనటానికి ఓ ఏడుగురు (అశ్విన్, చేతన్ శ్రీను, బార్బీ,విద్యుర్లేఖ, షకలక శంకర్, ధనరాజ్, ధన్య బాలకృష్ణ) బయిలు దేరి వెళతారు.


అక్కడ ఆ భవంతిలోవారికి బొమ్మాళ రాజు ఆత్మగా మారి రాసుకున్న డైరీ కనపడుతుంది. ఇంతకీ ఆ భవంతిలో ఏముంది... లేక అక్కడ జరిగే సంఘటనలు...ఛానెల్ వారు భయపెట్టడానికి ఏర్పాటు చేసినవా...ఇంతకీ బొమ్మాళి(పూర్ణ) ఎవరు...ఆమె కథేంటి... ఆ ఏడుగురు పరిస్ధితి ఏమిటి తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.

English summary
Impressed with Ohmkar’s talent, leading producer Anil Sunkara is said to be in talks with the director to produce a medium budget film under his AK Entertainments banner. Reports reveal that Raju Gari Gadhi makers will enter the profit zone by this weekend.
Please Wait while comments are loading...