»   » మహేష్, మురుగదాస్ ప్రాజెక్ట్,లాస్ట్ మినిట్ ట్విస్ట్,ఆమెకు ప్లస్

మహేష్, మురుగదాస్ ప్రాజెక్ట్,లాస్ట్ మినిట్ ట్విస్ట్,ఆమెకు ప్లస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్, మురగదాస్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్ గా పరిణితి చోప్రాని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆమె డేట్స్ ఇబ్బంది అవటంతో సీన్ లోకి రకుల్ ప్రీతి సింగ్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు రకుల్ ప్రీతి సింగ్ తో ఫొటో షూట్ సైతం చిత్రం కార్యాలయంలో జరిపినట్లు సమాచారం. దాంతో తంతే బూరెల బుట్టలో పడినట్లుగా మారింది రకుల్ పరిస్దితి. వరసగా పెద్ద హీరోల సరసన ఆఫర్స్ పడుతున్న ఆమెకు ఈ ఆఫర్ ఊహించనదే.

దానికి తోడు రకుల్ ప్రీతి సింగ్ అయితే రెమ్యునేషన్ కూడా పరిణితి చోప్రాకు ఇచ్చినంత ఇవ్వక్కర్లేదని నిర్మాతలు సంబరపడుతున్నారట. అయితే మురగదాస్ మాత్రం బాలీవుడ్ లో కూడా సినిమా రిలీజ్ కావాలంటే అక్కడ పాపులర్ ఫేస్ లతో వెళితే మంచిదని సలహా ఇస్తున్నాడట.

తన ఇమేజ్ ఎలాగో బాలీవుడ్ ఎంట్రీకి ఉపయోగపడినా, మహేష్, రకుల్ ప్రీతి సింగ్ అనేసరికి బాలివుడ్ లుక్ రాదని, సౌత్ డబ్బింగ్ సినిమానే అనుకుంటారనే సందేహం వ్యక్తం చేస్తున్నాడట. కానీ మహేష్, నిర్మాతలు మాత్రం రకుల్ కే ఓటు వేయటంతో మురగదాస్ కు ఓకే అనక తప్పేటట్లు లేదని అంటున్నారు.

rakul

ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాకు బడ్జెట్ 80 కోట్ల వరకు అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం ఆరు నిర్మాణ సంస్ధలు కలిసి పని చేయనున్నాయని సమాచారం.

మొదట నుంచి చెపుతున్నట్టుగా ఠాగూర్ మధు, ఎన్వీప్రసాద్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. వీరితో పాటు రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, లియో ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ లు నిర్మాణంలో భాగం పంచుకుంటాయి. ఇక హీరో మహేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తాడు.

అలాగే ఈ సినిమాకు టైటిల్ గా 'ఎనిమీ', 'చట్టంతో పోరాటం' అనే పేర్లు వినిపించాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఆలోచిస్తున్నారట చిత్రయూనిట్. గజనీ టైటిల్ తరహాలో మహేష్ సినిమాకు 'వాస్కోడాగామ' అనే టైటిల్ ను పెట్టాలని భావిస్తున్నాడట.

ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా దర్శకుడు మాత్రం ఇదే టైటిల్ ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను హైదరాబాద్ తో పాటు పుణె, రాజస్థాన్, ముంబైలలో చిత్రీకరించనున్నారు.

English summary
Tollywood Star heroine Rakul Preet Singh Consider for Mahesh Babu and Murugadoss Film insted of Parinithi chopra.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu