»   » లోగుట్టు: పవన్ కోసం రకుల్ గేమ్ ప్లాన్

లోగుట్టు: పవన్ కోసం రకుల్ గేమ్ ప్లాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సరసన చేయాలని హీరోయిన్స్ అందరికీ ఉత్సాహం ఉంటుంది. అలాగే చాలా మంది హీరోయిన్స్ టార్గెట్ కూడా అదే ఉంటుంది. అలాంటిది స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న రకుల్ ప్రీతి సింగ్ కు అలాంటి ఆలోచన ఉండటంలో తప్పేముంది. ఆమె పవన్ కళ్యాణ్ సరసన చేయటానికి పావులు కదుపుతోందని వినికిడి.

తెలుగు సిని వర్గాల్లో చెప్పుకుంటున్న దాని ప్రకారం ఆమె మొదట రామ్ చరణ్ తో మెగా క్యాంప్ లో ప్రవేశించింది. అంతేకాదు చాలా కాలం తర్వాత చిరంజీవి ఈ సినిమాలో గెస్ట్ గా కనిపించారు. ఆ సన్నివేశాల్లో ఆయనతో పాటు రకుల్ కనిపించి ఆ రికార్డుని సొంతం చేసుకుంది. అలాగే తన అభిమాన హీరో అల్లు అర్జున్ తో ఇప్పుడు సినిమా చేస్తోంది. ఇలా మెగా క్యాంప్ లో ప్రవేశించి మార్కులు వేసుకుంటోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Rakul Preet Singh's Game Plan On Pawan Kalyan

అంతేనా పవన్ కళ్యాణ్ కు చెందిన మేనేజర్స్ తో పర్శనల్ వారితో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు పవన్ ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటోంది. ఆయన తదుపరి చిత్రంలో ఎట్టి పరిస్దితుల్లో తన పాత్రను ఖరారు చేసుకోవాలని చూస్తోంది. పవన్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడని వినికిడి.

మోడలింగ్ నుండి సినిమాల్లోకి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనే ప్రచారం టాలీవుడ్ లో సూపర్ గా జరుగుతోంది.ఆమె పారితోషికం విషయంలోనూ చాలా క్లారిటీతో ఉంటోంది.

రకుల్ మాట్లాడుతూ..."నా పారితోషికం విషయంలో మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను ...హీరోలతో సమానంగా హీరోయిన్స్ కు కూడా రెమ్యునేషన్ ఇవ్వాలని ఫీలవుతాను. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే...ఓ హీరో ఓ చిత్రం ఫినిష్ చేసేటప్పటికి ...హీరోయిన్స్ మి అయిన మేము మూడు సినిమాలు పూర్తి చేస్తాము..కాబట్టి నాకు ఏదైతే రెమ్యునేషన్ వస్తోందో...దాంతో హ్యాపీ ", అంటూ తేల్చి చెప్పింది రకుల్ ప్రీతి సింగ్.

English summary
The new fad in the T-town, Rakul Preet Singh is moving pawns to grab a chance alongside Pawan Kalyan. If the sources are to be believed, she is of late keen on working with Pawan, just to register a rare record on her name. It is known that the actress recently paired with Ram Charan in Bruce Lee and has also bagged the golden opportunity of acting with Megastar Chiranjeevi. On the other hand, she is working with her favorite hero, Allu Arjun, who also happen to hail from mega family.
Please Wait while comments are loading...