అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న రామ్ చరణ్ - పూజా హెగ్డే!
మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్యపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా నక్సల్స్ బ్యాక్ డ్రాప్ పాత్రల్లో నటిస్తున్న మెగా హీరోలు తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక మంచి సందేశం ఉంటుంది.
ఇక ఆచార్యలో ఇద్దరు మెగా హీరోలు కాబట్టి అంతకుమించి అనేలా హైలెట్ పాయింట్ ఉంటుందని చెప్పవచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే ఉంటాయని పోస్టర్స్ చూస్తేనే అర్ధమయ్యింది. ముఖ్యంగా లాహే లాహే సాంగ్ కూడా మంచి బజ్ క్రియేట్ చేసి ఇప్పటికి కూడా ట్రెండింగ్ లిస్ట్ లో కొనసాగుతోంది. అలాగే మరొక సాంగ్ ను విడుదల చేయబోతున్నారట.

ఈసారి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. అసలైతే గత నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితుల దృష్ట్యా సినిమాను వాయిదా వేయడమే కాకుండా అప్డేట్స్ ను కూడా ఆపేశారు. ఇక జూలై నెలలో సాంగ్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి ఆ సాంగ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











