టాలీవుడ్‌లో సంచలన కాంబినేషన్: ఆ స్టార్ హీరోతో రామ్ చరణ్ మల్టీస్టారర్.. అన్ని వందల కోట్ల బడ్జెట్‌తో!

సినీ ప్రియుల అభిరుచి రోజు రోజుకూ మారిపోతోంది. ఈ కారణంగానే వాళ్లు కొత్త కొత్త ప్రయోగాత్మక చిత్రాలపై మక్కువ చూపిస్తున్నారు. అలాగే, భిన్నమైన కథలకు మంచి స్పందనను అందిస్తున్నారు. అన్నింటికీ మించి మల్టీస్టారర్ మూవీలకు జై కొడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఎక్కువగా అలాంటి మూవీలు వస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం హిట్లుగా నిలుస్తున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు, హీరోలు మరిన్ని చిత్రాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్ మరో స్టార్ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడని తెలిసింది. ఆ సంగతులు మీకోసం!

పాన్ ఇండియా స్టార్‌గా చరణ్

పాన్ ఇండియా స్టార్‌గా చరణ్

రామ్ చరణ్ గత ఏడాది RRR అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ మూవీతో అతడు మరో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ మూవీతో అతడి క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. అయితే, ఆ తర్వాత చరణ్ నటించిన మరో చిత్రం 'ఆచార్య' మాత్రం ఎక్కువ నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలింది.

శంకర్‌తో భారీ బడ్జెట్ సినిమా

శంకర్‌తో భారీ బడ్జెట్ సినిమా

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, శ్రీకాంత్, అంజలి, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

బుచ్చిబాబుతో క్రేజీ ప్రాజెక్టు

బుచ్చిబాబుతో క్రేజీ ప్రాజెక్టు

ఎస్ శంకర్‌తో చేస్తోన్న సినిమా పూర్తి కాకముందే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనతో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

17వ సినిమాపై ప్రచారాలు

17వ సినిమాపై ప్రచారాలు

ఈ మధ్య కాలంలో వరుస చిత్రాలతో ఫుల్ జోష్‌ను చూపిస్తోన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించే 17వ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. దీన్ని ఫలానా దర్శకుడితో చేయబోతున్నాడని చాలా రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకుల పేర్లు కూడా తెరపైకి వస్తోన్న విషయం తెలిసిందే.

ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్

ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్


రామ్ చరణ్ నటించబోయే 17వ సినిమా గురించిన ఓ సంచలన న్యూస్ తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. అతడు కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డు విన్నర్ సూర్యతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది. ఇది సూర్యకు 44వ మూవీగా రాబోతుందని సమాచారం.

క్లాసిక్ డైరెక్టర్‌ ప్రయత్నాలు

క్లాసిక్ డైరెక్టర్‌ ప్రయత్నాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య కాంబినేషన్‌లో రాబోయే సినిమాను 'సీతా రామం' దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించబోతున్నాడట. ఇప్పటికే అతడు దీనికి సంబంధించిన స్క్రిప్టును కూడా రెడీ చేశాడని అంటున్నారు. ఇప్పటికే ఈ కథను హను.. రామ్ చరణ్‌కు వినిపించాడని, త్వరలోనే సూర్యతో కూడా సమావేశం అవబోతున్నాడని తెలిసింది.

వందల కోట్ల బడ్జెట్‌తోనే

వందల కోట్ల బడ్జెట్‌తోనే

రామ్ చరణ్ - సూర్య హీరోలుగా హను రాఘవపూడి తెరకెక్కించే సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించబోతున్నారని తెలిసింది. అంతేకాదు, ఈ సినిమాను దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తీయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడీ న్యూస్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X