రామ్ చరణ్ కోసం మరో తమిళ దర్శకుడి ప్రయత్నాలు.. శంకర్ కంటే ముందే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎన్నడూ లేని విధంగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకులు కూడా వారి ఆలోచనలను మరింత అప్గ్రేడ్ చేసుకుంటూ నేషనల్ వైడ్ గా సినిమాలను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక హీరోలైతే ఒక్కసారి పాన్ ఇండియాను టచ్ చేస్తే మళ్ళీ అదే ఫార్మాట్ ను ఫాలో అవ్వాలని టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ కూడా మరో తమిళ్ దర్శకుడితో పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది.

ఇండియన్ 2 తరువాతే

ఇండియన్ 2 తరువాతే

RRR తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. అయితే శంకర్ ఇండియన్ 2ను పూర్తి చేసిన తరువాతే మరొక సినిమాను సెట్స్ పైకి తీసుకురావచ్చని టాక్ వస్తోంది. విషయం కోర్టు వరకు వెళ్లడంతో శంకర్, రామ్ చరణ్ తో ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం లేదట.

జూనియర్ ఎన్టీఆర్ తరహాలోనే

జూనియర్ ఎన్టీఆర్ తరహాలోనే

ఇక RRR అనంతరం వెంటనే మరొక సినిమాను స్టార్ట్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ కొరటాలను లైన్ లో పెట్టాడు. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇక రామ్ చరణ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తరహాలోనే నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు.

చేస్తే మళ్ళీ పెద్ద సినిమానే చేయాలని..

చేస్తే మళ్ళీ పెద్ద సినిమానే చేయాలని..

ఇక RRR అనంతరం వెంటనే శంకర్ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మరొక సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొంతమంది తెలుగు దర్శకులు కమర్షియల్ కథలు బాగానే సెట్ చెప్పినప్పటికీ రామ్ చరణ్ వాటిపై ఇంట్రెస్ట్ చూపడం లేదట. చేస్తే మళ్ళీ పెద్ద సినిమానే నేషనల్ వైడ్ గా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నాడు.

మరో తమిళ దర్శకుడు రెడీ?

మరో తమిళ దర్శకుడు రెడీ?

ఇక రీసెంట్ గా మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్, రామ్ చరణ్ కోసం ఒక కథ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇంకా పూర్తి స్క్రిప్ట్ అయితే సిద్ధమవ్వలేదట. రామ్ చరణ్ కూడా ఆ స్టోరీ లైన్ వినగానే పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. ఒకవేళ శంకర్ కంటే ముందే సిద్ధంగా ఉంటే ఆ ప్రాజెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడట. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X