»   » ఎంఎస్ ధోనీ మూవీ: రామ్ చరణ్ కూడా, సర్ ప్రైజ్ చేయాలనే సస్పెన్స్?

ఎంఎస్ ధోనీ మూవీ: రామ్ చరణ్ కూడా, సర్ ప్రైజ్ చేయాలనే సస్పెన్స్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ టీమిండియా క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ జీవితంపై సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. 'ఎమ్మెస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' టైటిల్ తో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాని, ధోనీకి అత్యంత సన్నిహితుడైన సురేష్ రైనా పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారని సినిమా మొదలైనప్పటి నుండి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం మాత్రం లేదు. సినిమా విడుదల దగ్గర పడుతున్న వేళ ఇది మళ్లీ తెరపైకి వచ్చింది.

ఇటీవల సినిమా ప్రమోషన్లో భాగంగా తెలుగు వెర్షన్ ఆడియో విడుదల వేడుక జరుగ్గా..... ధోనీ వచ్చారు. ఈ వేడుకకు రామ్ చరణ్ వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో? అలాంటిదేమీ జరుగలేదు. అయినా రామ్ చరణ్ ఉన్నాడనే ప్రచారం మాత్రం ఆగడం లేదు.

సర్ ప్రైజ్ చేయాలనే

సర్ ప్రైజ్ చేయాలనే

అయితే ప్రేక్షులను సర్ ప్రైజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పాకిస్థాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ విరాట్‌ కొహ్లీ పాత్రను పోషించినట్లు వార్తలు వెలువడ్డాయి.

రామ్ చరణ్ పేరు చెబితే సినిమాపై అంచనాలు మరోలా ఉంటాయనే

రామ్ చరణ్ పేరు చెబితే సినిమాపై అంచనాలు మరోలా ఉంటాయనే

అయితే రామ్ చరణ్ కనిపించేది కేవలం ఒక చిన్న సీన్లో మాత్రమే. బయట పబ్లిసిటీ చేసేంత, ట్రైలర్లో చూపేంత పెద్ద సీన్ లేదు కాబట్టే ఆయన పేరును, ఫోటోలను ప్రచారంలో వాడటం లేదని అంటున్నారు. రామ్ చరణ్ ఉన్నాడని ప్రచారం చేస్తే సినిమాపై ప్రేక్షుకులు మరోలా ఉహించుకోవడం సినిమాను ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉందనే వాదన కూడా ఉంది.

అదే నిజమైతే....

అదే నిజమైతే....

ప్రస్తుతానికైతే రామ్ చరణ్ ఉంటాడనేది కేవలం ఊహ మాత్రమే. ఒక వేళ రామ్ చరణ్ సినిమాలో ఉంటే మాత్రం... ప్రేక్షకులు థ్రిల్ అయ్యే అవకాశం ఉంది. ఈ సడెన్ సర్ ప్రైజ్ వసూళ్ల పరంగా కలిసి రావొచ్చు.

అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

ధోనీ క్రికెట్ జీవితం మాత్రమే మనకు తెలుసు. ఈ సినిమాలో ధోనీ చిన్నతనం, క్రికెటర్ గా ఎదిగిన వైనం, ఈ స్థాయికి రావడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత శ్రమించారు అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ధోనీ పాత్రలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటిస్తున్నాడు. ధోనీ భార్య సాక్షి రావత్ పాత్రలో కైరా అద్వానీ నటిస్తున్నారు. భూమిక చావ్లా, దిశా పటాని కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Speculations are going on that Ram Charan is going to be seen as Suresh Raina in Sushant Singh Rajput’s MSDhoni: The Untold Story. This upcoming Bollywood biopic film is on Indian cricket skipper captain Mahendra Singh Dhoni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu