»   » డాక్టర్ గా రామ్ చరణ్, కాకపోతే సంవత్సరం ఆగాలి మరి

డాక్టర్ గా రామ్ చరణ్, కాకపోతే సంవత్సరం ఆగాలి మరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తన కెరీర్ లో ఇప్పటివకూ డాక్టర్ గా కనిపించలేదు. సరదాగా రచ్చ చిత్రంలో ...చిరంజీవిని అనుకరిస్తూ చేసిన స్టెప్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ ..పూర్తి స్దాయిలో డాక్టర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అంటే సురేంద్రరెడ్డి దర్శకత్వంలో అనుకుంటున్నారా..అయితే అదేమి లేదు... ఆయన త్వరలో సుకుమార్ కోసం చేయబోతున్న చిత్రం కోసం అని తెలుస్తోంది.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...రామ్ చరణ్ కోసం ఓ ఇంట్రస్టింగ్ క్యారక్టర్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. 'ఫార్ములా ఎక్స్' పేరుతో ఈ సినిమా రాబోతోందని అంటున్నారు.

ramvharan

టైటిల్ చూసిన వారంతా ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ అంటేనే...రోటీన్ సినిమాలకు భిన్నంగా ఆలోచించే దర్శకుడు. కెరీర్లో ఇప్పటి వరకు చాలా ప్రయోగాలు చేసిన సుకుమార్ ఈ సారి చెర్రీ మీద 'ఫార్ములా ఎక్స్'ప్రయోగం చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాకు సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాద్ అందిస్తాడని తెలుస్తోంది. ఈ మధ్య రామ్ చరణ్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసి బోల్తా పడుతున్నారు. అందుకే ఈసారి తెగింపు నిర్ణయం తీసుకున్నాడని, సుకుమార్ తో ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ధృవ సినిమాతో చెర్రీ బిజీగా ఉండగా, సుకుమార్ తన సినిమాకు ప్రీప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు పూర్తిచేస్తున్నాడట. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఈ ఏడాది ఆగస్టు లేదా, సుప్టెంబర్లో సినిమా ప్రారంభం అవుతుందని టాక్.


ధృవ విశేషాలకు వస్తే...

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధృవ' చిత్రంలో ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా.. రామ్ చరణ్ మాత్రం చిత్ర షూటింగ్ లో పాల్గొన లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం శనివారం నుంచి హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొననున్నాడు.

గచ్చిబౌలి లో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. గీతా ఆర్ట్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తుండగా, అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. కాగా తమిళంలో హిట్ కొట్టిన తనిఒరువన్ తెలుగు రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

English summary
Ram Charan will be seen as a doctor in Sukmar's scientific-thriller.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu