»   »  రామ్ చరణ్ తో బోయపాటి ఆ సీక్వెల్?

రామ్ చరణ్ తో బోయపాటి ఆ సీక్వెల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Charan in 'Bhadra 2' with Boyapati Srinu?
హైదరాబాద్: రామ్ చరణ్ తో బోయపాటి శ్రీను త్వరలో ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం బోయపాటి తొలి చిత్రం 'భధ్ర' కి సీక్వెల్ లాంటి కథ అని ఫిల్మ్ నగర్ సమాచారం. సింహా తరహాలోనే లెజండ్ కథ ఉన్నా ట్రీట్ మెంట్ లో తేడా చూపించి హిట్ కొట్టినట్లే భధ్ర తరహా కథని కొద్దిగా మార్చి లవ్ స్టోరీకి ప్రాధాన్యత ఇచ్చి రామ్ చరణ్ తో చేయటానికి ఫిక్స్ అయ్యాడని చెప్తున్నారు. ఈ కథకు చిరంజీవి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు.

అంతేకాకుండా రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వరస హిట్స్ తో దూసుకుపోతున్న శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆయన తన నెక్స్ట్ చిత్రం చేయనున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ,శ్రీను వైట్ల కాంబినేషన్ అని వార్తలు వస్తున్నప్పటికీ రామ్ చరణ్ తోనే అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్ధ ఈ చిత్రం నిర్మించనుంది. ఈ మేరకు శ్రీను వైట్ల స్క్రిప్టు వర్క్ ప్రారంభించాడని అంటున్నారు. యాక్షన్ తో కూడిన కామెడీగా చిత్రం రూపొందనుంది. ఆగడు షూటింగ్ పూర్తైన వెంటనే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.

ప్రస్తుతం కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ లో రెగ్యులర్ గా రామ్ చరణ్ పాల్గొంటున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా ఓ కుటుంబ కథా చిత్రం తెరకెక్కుతోంది. కాజల్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- ''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్‌చరణ్‌ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్‌ ఇందులో రామ్‌చరణ్‌కి యంగ్‌ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ''అన్నారు.


కృష్ణవంశీ మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు తండ్రిగా నాగార్జునని అడుగుతున్నారని తెలుస్తోంది. తాతగా రాజ్ కిరణ్ కనిపించనున్నాడు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

English summary
Boyapati's next film with Ram Charan has been green lit by Chiranjeevi. This film with Ram Charan is going to be a romantic family entertainer in the lines of Boyapati's first film Bhadra. Even Bhadra has some very powerful action scenes, but it was predominantly a love story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu