ఇంకో రీమేక్ కోసం... రామ్ చరణ్ స్కెచ్?

By Srikanya

హైదరాబాద్ : ఇప్పటికే తని ఒరువన్ రీమేక్ లో చేస్తున్న రామ్ చరణ్ ..తాజాగా మరో చిత్రం '49-ఒ' రీమేక్ రైట్స్ దక్కించుకున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తుంది. '49-ఒ' ఓ తమిళ చిత్రం...ఈ చిత్రంలో హీరోగా గౌండమణి చేసారు.చాలా కాలం గ్యాప్ తర్వార ఆయన రైతుల సమస్యలను బేస్ చేసుకుని ఈ సినిమా చేసారు. దర్శకుడు గౌతమ్ మీనన్ దగ్గర డైరక్షన్ డిపార్టమెంట్ లో చేసిన పి. ఆరోగ్యదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.

Ram Charan keen on Telugu remake of '49-o' ?

సినిమా అద్బుతం అనిపించకపోయినా...గ్యాప్ తర్వాత చేసిన గౌండమణి కోసం, సినిమాలో ఉన్న మ్యాటర్ కోసం చూడాల్సిందే అని తమిళ మీడియా రాసుకొచ్చింది. రీసెంట్ గా ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ చూశారని అంటున్నారు. మీరు కూడా ఈ చిత్రం ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

సినిమాలో కంటెంట్ కు కనెక్టు కావటంతో రీమేక్ హక్కులు కూడా చేజిక్కించుకున్నారని తమిళ సినీ వర్గాల టాక్. అయితే ఓ కమిడియన్ హీరోగా చేసిన సినిమాని రామ్‌చరణ్ మాత్రం ఏం చేసుకుంటాడు, ఇవన్నీ రూమర్సే అని కొందరు కొట్టిపారేస్తున్నారు. కత్తి సినిమా కూడా ఇలాంటి కథే కావటంతో ఈ సినిమాను రామ్ చరణ్ చేస్తాడని అనటంతో ఈ రూమర్స్ పుట్టాయంటున్నారు.

అయితే సొంత సంస్థ ఆరంభించి, ఆయన చిన్న సినిమాలు నిర్మించాలనుకుంటున్నారు కదా..అందుకోసం తీసుకున్నాడు అని మరికొందరు అంటున్నారు. ఇవన్నీ కాదు.... తన తండ్రి చిరంజీవి 150వ సినిమాకి ఆ కథ కొద్దిపాటి మార్పులు చేర్పులతో బాగుంటుందని కొన్నారని మరికొందరు వాదిస్తున్నారు. ఏది రూమరో, ఏది నిజమో తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X