»   » చెర్రీ కెరీర్ స్కెచ్ మామూలుగా లేదు...సుకుమార్ తర్వాత ఆ డైరక్టర్ తో ఫైనల్

చెర్రీ కెరీర్ స్కెచ్ మామూలుగా లేదు...సుకుమార్ తర్వాత ఆ డైరక్టర్ తో ఫైనల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కే అవకాసం ఉందంటూ చాలా కాలంగా వార్తలు విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా కోసం మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి హైదరాబాద్‌కి వచ్చి చిరుతో కథా చర్చలు సాగించినట్టు సమాచారం. ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చి, రామ్ చరణ్ నుంచి, చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ పొందినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మణిరత్నం కార్తీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పూర్తి కాకముందే మణి ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం తనతో సినిమా చేయడం చెర్రీ తన అదృష్టంగా భావిస్తున్నాడు. ప్రస్తుతం చరణ్ సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మణి కాంబినేషన్‌లో చిత్రం ఉండబోతోంది. జూన్ నుంచి మణిరత్నానికి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మణిరత్నం టీమ్ ఈ కొత్త కాంబో చిత్రానికి లొకేషన్స్ ఫైనలైజ్ చేస్తున్నారని వినికిడి. తమిళ,తెలుగు,హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాని మణిరత్నం స్వయంగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుని సుహాసిని ప్రపోజల్ తో ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.

Ram Charan Mani Rathnam's movie pre production begins

ధృవ సినిమా తనను ఎ సెంటర్ ప్రేక్షకులకు దగ్గర చేస్తుందని చెర్రీ భావించి చేసారు. దీనికి కంటిన్యూషన్ గా మణిరత్నం సినిమా చేస్తే, ఆ మార్కెట్ ను పదిలం చేసుకోవచ్చు అనుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. అందుకే సుక్కు సినిమా తరువాతి సినిమాకు డైరక్షన్ మణిరత్నమే అని ఫిక్స్ అయిపోయాడట. పైగా బన్నీ ఎలాగూ తమిళ మార్కెట్ లో ఎంటర్ అవుతున్నాడు. అంతేకాకుండా రామ్ చరణ్ కు కూడా ఈ ప్రాజెక్టుతో అక్కడ పరిచయం అయినట్లు వుంటుందని కూడా ఆలోచిస్తున్నారట.

అంతాబాగానే ఉంది మరి ఈ చిత్రం ఎప్పటిలా మణిరత్నం స్కూల్ లో ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ సాగుతుందా లేక ప్రయోగాలకు తావు లేకుండా చేయడంలో చెర్రీ స్కీమ్ లోకి వచ్చేసి చేస్తారా ఈ రెండు కాక...మిక్స్ చేసి క్లాస్ , మాస్ కలిపి సినిమా అందిస్తారా అనేది చూడాల్సి ఉంది.

English summary
Mani Rathnam has already begun pre production work for his next movie with Ram Charan.
Please Wait while comments are loading...