»   » క్రిష్ స్కెచ్ అదిరింది : రామ్ చరణ్ తో రాయబారం, నో బడ్జెట్ లిమిట్స్, ఫలించినట్లే

క్రిష్ స్కెచ్ అదిరింది : రామ్ చరణ్ తో రాయబారం, నో బడ్జెట్ లిమిట్స్, ఫలించినట్లే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒక హీరోతో అనుకున్నది మరో హీరోతో చేయటం సిని పరిశ్రంలో చాలా చాలా కామన్ విషయం. అయితే ఒక హీరోతో ఆగిపోయిన ప్రాజెక్టుని అదే క్యాంప్ కు చెందిన మరో హీరోతో ముందుకు తీసుకువెళ్ళటం మాత్రం చిత్రమైన విషయమే. అలాంటి సంఘటనే ఇప్పుడు టాలీవుడ్ లో చోటు చేసుకోబోతోంది. వరణ్ తేజతో అనుకున్న సినిమా ముందుకు వెళ్లక ఆగితే ఇప్పుడు రామ్ చరణ్ తో అది పట్టాలు ఎక్కుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..'గమ్యం', 'వేదం', 'కంచె','గౌతమిపుత్ర శాతకర్ణి' వంటి సినిమాలతో విభిన్నమైన దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ఆ మధ్యన ఓ స్పై ధ్రిల్లర్ చిత్రం చేయాలని సన్నాహాలు మొదలుపెట్టాడు. అందుకోసం మెగా హీరో వరుణ్‌తేజ్‌ ని హీరోగా ఎంచుకున్నారు.

Ram Charan Movie Like James Bond Film?

వరణ్ తేజ తో రూపొందించిన 'కంచె' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ప్రారంభం కానుందని అంతా అనుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. 'రాయబారి' టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రం స్పైయింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ భారీ యాక్షన్ సన్నివేశాలు వుంటాయని, దానికోసం జార్జియాలో లొకేషన్లు కూడా ఫైనల్ చేశారని చెప్పుకున్నారు. అయితే బడ్జెట్ సమస్యలతోనో లేక మరొకటో కానీ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు.

కానీ ఇప్పుడా చిత్రాన్ని మళ్లీ క్రిష్ మొదలెట్టాలని భావిస్తున్నారని సమాచారం. అందుకోసం ధృవతో హిట్ కొట్టి స్టైలిష్ హీరోగా దూసుకుపోతున్న మెగా హీరో రామ్ చరణ్ తో చేస్తే బాగుంటుందని భావించి, ఆ మేరకు సన్నాహాలు చేస్తున్నారట. రామ్ చరణ్ అయితే బడ్జెట్ కు సమస్య ఉండదని ఆయన ఆలోచన అని తెలుస్తోంది. ఇదే నిజమైతే జేమ్స్ బాండ్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారన్నమాట. ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది త్వరలో తేలనుంది.

English summary
Ram Charan will be doing a spy thriller. Krish, who helmed recent hit film 'Gauthamiputra Satakarni', will work with Ram Charan for this spy thriller.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu