»   »  పవన్ కు ఫ్లాఫ్ ఇచ్చాడు..ఇప్పుడు రామ్ చరణ్ తో

పవన్ కు ఫ్లాఫ్ ఇచ్చాడు..ఇప్పుడు రామ్ చరణ్ తో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ పెద్ద డిజాస్టర్ చిత్రం అందించిన దర్శకుడుతో రామ్ చరణ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు...పంజా దర్శకుడు విష్ణు వర్ధన్. పవన్ కళ్యాణ్ తో చేసిన పంజాకు టెక్నికల్ గా మంచి పేరు వచ్చినా సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది. అయితే మేకింగ్ పరంగా ఓ స్ధాయిలో చూపించగల దర్శకుడు కావటంతో మంచి కథతో వస్తే రామ్ చరణ్ ఆ దర్శకుడుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ప్లానింగ్ స్టేజీలో ఈ చిత్రం ఉంది.

Ram Charan next with Panjaa director?

రామ్ చరణ్ తదుపరి చిత్రం విషయానికి వస్తే... ఆయన తమిళ చిత్రం ' 'తని ఒరువన్‌'' రీమేక్ చేస్తున్నారు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం జనవరి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ వెళ్లనుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి టెక్నీషియన్స్ ని ఫైనలైజ్ చేసేసారు. ఈ చిత్రానికి భజరంగి భాయీజాన్, ఏక్తా టైగర్ సినిమాలకు పనిచేసిన కెమెరామెన్ అశీమ్ మిస్రా ని ఎంపిక చేసారు. అలాగే..సంగీత దర్శకులుగా తని ఒరువన్ కి పనిచేసిన వారే చేస్తున్నారు.

ఇక విలన్ గా..అరవింద్ స్వామినే ఫైనలైజ్ చేసారు. రకరకాల ఆప్షన్స్ అనుకున్నప్పటికీ అరవింద్ స్వామే ఫెరఫెక్ట్ ఛాయిస్ అనే నిర్ణయానికి వచ్చారు. ఆయన కు మంచి రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాని ఎన్ వి ప్రసాద్, అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తున్నారు.

English summary
Vishnu Vardhan, who is known for making Panjaa with Pawan Kalyan, came up with a script for Ram Charan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu