»   » రామ్ చరణ్ తేజ కొత్త చిత్రం ఓవర్ సీస్ రికార్డు

రామ్ చరణ్ తేజ కొత్త చిత్రం ఓవర్ సీస్ రికార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ తేజ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రానున్న ఆరెంజ్ చిత్రానికి ఓవర్ సీస్ పంపణీ రైట్స్ రెండున్నర కోట్ల వరకూ పలికిందని సమాచారం. ఇప్పుటివరకూ తెలుగు సినీ పరిశ్రమలో ఏ చిత్రానికీ ఈ రేటు రాలేదు. దాంతో ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గత చిత్రం మగధీర సూపర్ హిట్టు కావటం, భాస్కర్ దర్శకత్వం ఈ చిత్రంపై మంచి అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మిస్తున్నారు. జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది. కేవలం ఓవర్ సీస్ మార్కెట్టే ఇంత పలికితే ఇక మిగతా పంపిణీ రైట్స్ ఎంతుంటాయోనని మార్కెట్లో అంచనాలు మొదలయ్యాయి.

Please Wait while comments are loading...