»   » రామ్ చరణ్ ఇది నిజమేనా..ఎక్కడో కొడ్తోంది

రామ్ చరణ్ ఇది నిజమేనా..ఎక్కడో కొడ్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చరన్న సంగతి తెలిసిందే. ఆయన తొమ్మిదో చిత్రం అది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రానికి "9"అనే టైటిల్ పెట్టినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్ వంటి స్టార్ హీరో చిత్రానికి ఇలాంటి టైటిల్ ఎందుకు పెడతారు. ఇదే టైటిల్ పెడితే ఏదో క్రైమ్ థ్రిల్లర్ అనుకునే ప్రమాదం ఉంటుంది కదా అంటున్నారు. యాక్షన్ కామెడీగా రూపొందే ఈ చిత్రం స్క్రిప్టుని ఇప్పటికే శ్రీను వైట్ల వినిపించాడని తెలుస్తోంది.

మరో ప్రక్క ఈ చిత్రం గురించి మరో రూమర్ ప్రచారంలోకి వచ్చింది. చిత్రం కథ..చిరంజీవి హిట్ చిత్రం మరణ మృదంగం నుంచి తీసుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఆ చిత్రాన్ని కేవలం బేస్ స్టోరీ లైన్ ని మాత్రమే తీసుకుని మిగతాది శ్రీను వైట్ల స్టైల్ ఆఫ్ నేరేషన్ లో ఉండబోతోందని అంటున్నారు. ఈ మేరకు శ్రీను వైట్ల...చిరుని కలిసి వివరించాడని చెప్పుకుంటున్నారు. ఆ చిత్రంలో రామ్ చరణ్ ..సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తాడని, అందుకోసమే సిక్స్ ప్యాక్ బాడీని సైతం సిద్దం చేసుకుంటున్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్...కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న గోవిందుడు అందరి వాడేలే చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Ram Charan’s movie no 9 is the title "9" !

రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నట్లు రెండేళ్ల నుంచీ ప్రచారంలో ఉంది. ఇన్నాళ్లకు అది ఓ కొలిక్కి వచ్చింది. ఆ కాంబినేషన్‌తో సినిమా తీసే అవకాశం యూనివర్సల్ మీడియా అధినేత డి.వి.వి. దానయ్యకు లభించింది. చరణ్ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో నటిస్తుండగా, మహేశ్‌తో శ్రీను వైట్ల 'ఆగడు' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఆగస్టు నాటికి పూర్తవుతాయని సమాచారం. నవంబర్ నుంచి షూటింగ్ మొదలు కానుందని అంటున్నారు.

అంటే రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ సినిమా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. శ్రీను మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. శ్రీను గతంలో చిరంజీవి హీరోగా 'అందరివాడు'ను రూపొందించారు. ఇప్పుడు ఆయన కుమారుడిని ఆయన డైరెక్ట్ చేయబోతున్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''దేశముదురు', 'జులాయి', 'నాయక్‌', 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'... చిత్రాల్ని మా సంస్థ తెరకెక్కించింది. ఇప్పుడు మరోసారి చరణ్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. నాయిక, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాము''అన్నారు.

English summary
Already plans are being made to roll the regular shoot of Charan’s 9th from November.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu