For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎవరి కోసం రామ్ చరణ్ ఇలా...?

  By Srikanya
  |

  హైదరాబాద్ : కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'గోవిందుడు అందరివాడేలే'లో అభిరామ్‌గా అందరినీ అలరించారు రామ్‌చరణ్‌. చిత్రం ఫలితం ఎలా ఉన్నా ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరైపోయారు. తరవాత చరణ్‌ కెమెరా ముందుకు రాలేదు. కొన్ని కథలు విన్నా.. దేనికీ 'ఓకే' చెప్పలేదు. అయితే దర్శకుడు శ్రీనువైట్లతో సినిమా మాత్రం ఖాయమైంది. ప్రస్తుతం శ్రీనువైట్ల చరణ్‌ కోసం ఓ శక్తిమంతమైన కథను సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈలోగా హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల కోసం అన్వేషణ జరుగుతోంది.

  మరోవైపు గౌతమ్‌మీనన్‌ కూడా చరణ్‌ కోసం ఓ కథ రాస్తున్నారు. 2015లోనే ఈ సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈమధ్య చరణ్‌ విభిన్నమైన కేశాలంకరణతో కనిపిస్తున్నారు. ఆ శైలి చూసి చరణ్‌ త్వరలో పోలీస్‌ పాత్రలో కనిపించబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అది శ్రీనువైట్ల సినిమా కోసమా? లేదంటే... గౌతమ్‌ మీనన్‌ సినిమా కోసమా అనేది తెలియాల్సి ఉంది.

  ఇప్పుడు మరో కన్నడ రీమేక్ పై రామ్ చరణ్ కన్నేసినట్లు సమాచారం.

  Ram Charan's next movie from Feb.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  ‘గోవిందుడు అందరివాడేలే' తర్వాత ఇప్పటికే పలువురి దర్శకులతో కథాచర్చల్లో పాల్గొన్న చరణ్ దేనిపైనా పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. గోవిందుడు కూడా అనుకున్న ఫలితం ఇవ్వకపోవటంతో ఓ రీమేక్‌పై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. కన్నడంలో ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన ‘బహద్దూర్' చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

  ధ్రువ్ సర్జా, రాధకా పండిట్ జంటగా నటించిన ఈ చిత్రానికి చేతన్‌కుమార్ దర్శకత్వం వహించారు. పక్కా మాస్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ బాక్సాఫీస్‌ను సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను ఇటీవలే చూసిన రామ్‌చరణ్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. . ఈ సినిమాకు సంబంధించిన హక్కులకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

  ఈ చిత్రం కథేమిటంటే..

  ఓ పెద్ద బహుదూర్ వంశానికి చెందిన హీరో అశోక్(ధ్రువ సర్జా) చుట్టూ కథ తిరిగుతుంది. అతను మైసూర్ వచ్చి తన ఐడింటిటీ దాచిపెట్టి తనెవరో చెప్పకుండా తనకు తగ్గ అమ్మాయిని వెతుకుతూంటారు. అప్పుడు అతనికో అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె అంజలి(రాధికాపండిట్). ఆమె తన తండ్రికి మాట ఇచ్చి ఉంటుంది. చదువు పూర్తైన తర్వాత ఎవరిని చూపెడితే వారినే పెళ్లి చేసుకుంటానని. ఈ విషయం తెలియని అశోక్ ఆమెతో ప్రేమలో పడి..ఆమె వెనక పడి, అల్లరి చేసి, చివరికి ఆమె చేత ఓకే చేయించుకుంటాడు.

  ఈ లోగా ఆమెకు ఇంటి నుంచి కబురు వస్తుంది. ఇంటికి వెళ్లగానే తండ్రి ఆమెతో..నీకు నా ఆత్మీయ స్నేహితుడు అప్పాజీ కుమారుడు శంకర్ తో పెళ్లి నిశ్చయం చేసానని చెప్పి, ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చేసేస్తాడు. తండ్రికి ఇచ్చిన మాట కాదనలేని అంజలి....ఇటు ఈ విషయం తెలుసుకున్న అశోక్ ఏం చేసారు. వారిద్దరి వివాహం ఎలా జరిగింది. ఈ కథలో అప్పాజీ గౌడ ఏం విలనీ చేసి, ఈ ప్రేమకుల మధ్య ఎడబాటు సృష్టించాడు వంటి ఆసక్తికరమైన అంశాలతో కథ నడుస్తుంది.

  English summary
  Ram Charan's next will be with Srinu vytla confirmed and the shooting will be starting from Feb-2015.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X