»   » 'శ్రీకృష్ణ దేవరాయలు'గా రామ్ చరణ్

'శ్రీకృష్ణ దేవరాయలు'గా రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : త్వరలో రామ్ చరణ్...చారిత్రిక ప్రాధాన్యత ఉన్న అద్పుతమైన శ్రీకృష్ణ దేవరాయుల పాత్రలో కనిపించనున్నారా అంటే అవుననే వినపడుతోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ మేరకు త్వరలో సైన్ చేయనున్నాడని, ఇప్పటికే ఈ చారిత్రిక కథకు సంభందించిన కథను విన్నాడని చెప్తున్నారు. అశుతోష్ గోవార్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని చెప్తున్నారు. ఆంధ్ర,కర్ణాటకల చెందిన శ్రీకృష్ణదేవరాయుల చరిత్ర...విజయనగర మహా సామ్రాజ్యం నేపధ్యంలో ఓ మహాకావ్యంగా తీయాలని ఎప్పటినుంచో అశుతోష్ కలలు కంటున్నారట.

ఎప్పుడైతే ఆయన మగధీర చిత్రాన్ని చూడటం సంభంవించిందో అప్పుడే రామ్ చరణ్ తో అటువంటి పాత్రను చేయించాలని ఉత్సాహం కలిగించని అంటున్నారు. దాంతో ఈ ప్రాజెక్టు విషయం చిరంజీవికి చెప్పటం జరిగిందని, ఆయన కూడా గో ఎ హెడ్ అన్నారని అంటున్నారు. రామ్ చరణ్ ..జంజీర్ చిత్రం ఫ్లాఫ్ అయినా అక్కడ బాగా పాపులర్ హీరో అవటం ఈ కొత్త ప్రాజెక్టుకి కలిసి వచ్చే అంశం. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో అనుకున్న ప్రాజెక్టు పూర్తి కాగానే ఈ చిత్రానికి సంభందించిన పనిలో పడతారని అంటున్నారు.

Ram Charan's Next on Sri Krishnadevaraya?!

ఇస రామ్‌చరణ్‌ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే...ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' . కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 వ తేదిన విడుదల చేయ్యాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించుకున్నారని సమాచారం. శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ మార్పు కొత్తగా వచ్చింది. ఇంతకు ముందు ఈ పాత్రకు గానూ రాజ్ కిరణ్ ని అనుకున్నారు.

English summary
Ram Charan's next Bollywood film is most likely to be a period one on Sri Krishna Devarayalu of Vijayanagara Maha Saamrajyam.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu