twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్-శ్రీను వైట్ల మూవీ స్టోరీలైన్ అదే అంటున్నారు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం స్టోరీ లైన్ చిరంజీవి నటించిన ‘విజేత' మూవీ ప్రేరణతో తయారు చేసారని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం ఎంతో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ తో పిలుస్తున్నారు. అయితే ఇది అఫీషియల్ టైటిల్ కాదు.

    ఈ చిత్రంలో రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ గా నటించబోతున్నాడు. పాత్రలో రియాల్టీ కోసం థాయ్ లాండ్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని జైకా స్టంట్ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు చరణ్. థాయ్‌లాండ్ లోని ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లలో ఇదీ ఒకటి. ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. క్రితి కర్బంధ ఈ చిత్రంలో రామ్ చరణ్ చెల్లెలు పాత్రలో నటిస్తోందట. సినిమా ప్రధానం ఆమె పాత్ర చుట్టూ తిరుగుతుందట.

    Ram Charan-Sreenu Vaitla's movie Story leaked

    ఇక ఈ చిత్రాన్ని ఈ దసరాకు విడుదల చేయాలని టార్గెట్ చేస్తున్నారు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

    విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Ram Charan-Sreenu Vaitla's upcoming film, which is tentatively titled as My Name Is Raju, is said to be inspired from an old super hit film of Megastar Chiranjeevi. Going by the grapevine, the film is loosely based on Chiranjeevi's Vijetha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X