»   » ఇది రామ్ చరణ్ క్లైమాక్స్...అందుకే అంత ఖర్చు

ఇది రామ్ చరణ్ క్లైమాక్స్...అందుకే అంత ఖర్చు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా క్లైమాక్స్ ని చిత్రీకరించినట్లు సమాచారం. ఈ క్లైమాక్స్ కోసం నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు చెప్పుకుంటున్నారు. క్లైమాక్స్ కోసం తెలుగు సినిమాలో నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. దాంతో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

క్లైమాక్స్ సీన్ పై అంత ఖర్చు పెట్టడాన్ని నిర్మాతని,దర్శకుడుని కొందరు అడిగితే ఇది రామ్ చరణ్ సినిమాలో క్లైమాక్స్ అందుకే అంత ఖర్చు పెడుతున్నాం. పెట్టినదానికి రెండింతలు వస్తుందని ధీమాగా చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్ర టీం బ్యాంకాక్ లోనూ, స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్ లో రెండు పాటల షూటింగ్ ని పూర్తి చేసుకొని వచ్చారు. ఇప్పుడు టీజర్ ని రెడీ చేసి విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదలయ్యే ఈ టీజర్ ని ఇప్పటికే చూసిన తమన్ ఈ విషయాన్నిచాలా ఎక్సైటింగ్ గా ట్వీట్ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Ram Charan-Srinu Vytla film: Spends A Bomb For Climax

చిత్రం వివరాల్లోకి వెళితే..

ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమాలో విలన్ రోల్ చేసిన అమితాష్ ప్రధాన్‌ గుర్తుండే ఉండి ఉంటారు. ఇప్పుడు అమితాష్ ని రామ్ చరణ్ తాజా చిత్రంలో ఓ పాత్రకు ఎంపిక చేశారు. రఘువరన్ బీటేక్‌లో ఓ రిచ్ బిజినెస్‍మేన్‌గా అమితాష్ మంచి ప్రతిభ కనబరిచారు. దాంతో తెలుగుకు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైద్రాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో అమితాష్ జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని అమితాష్ స్వయంగా ఖరారు చేసారు.

భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు శ్రీనువైట్ల మార్క్ కామెడీ సన్నివేశాలతో ఈ సినిమా అందరినీ అలరించేలా ఉండనుందని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 15న సినిమా విడుదల చేయాలని నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. డీవీవీ దానయ్య చాలా రిచ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే యూరప్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్‌లో జరుగుతోంది.

‘నా నెక్స్ట్ సినిమాలో ఇప్పటికే రెండు పాటలను, ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ మరియు కొన్ని సన్నివేశాలను షూట్ చేసాం. నా న్యూ టీం ఎనర్జీ విషయంలో నేను చాలా హ్యాపీ గా ఉన్నాను.. థాంక్యూ శ్రీను వైట్ల గారు' అని రామ్ చరణ్ తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసారు.

Ram Charan-Srinu Vytla film: Spends A Bomb For Climax

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు.

ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్‌ గురించి బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్‌. కథ రీత్యా ఈ సినిమాలో కొత్త తరహా ఫైట్లు చేయాల్సి ఉంటుందట. దీన్నిబట్టి అటు ఫైట్లు, ఇటు డ్యాన్సులు అదిరిపోయేలా ఉంటాయని అర్థమవుతోంది. తదుపరి షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌

ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Ram Charan, Rakul Preet Singh's upcoming entertainer directed by Srinu Vytla spent a whopping Rs.4crs for the climax scene.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu