For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై రామ్ చరణ్ ప్రశ్న.. ఇది అరాచకం.. కాంట్రవర్సీ ఎందుకని షాకింగ్ నిర్ణయం!

  |

  నందమూరి బ్రాండ్ స్థాయిని సినిమాల పరంగా మరో లెవెల్ కు తీసుకువెళుతున్న ఏకైక స్టార్ జూనియర్ ఎన్టీఆర్. సినిమా సినిమాకు అతని బాక్సాఫీస్ రేంజ్ మరో లెవెల్ కు వెలుతోంది. అయితే తారక్ పొలిటికల్ ఎంట్రీపై నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం మరొక న్యూస్ వైరల్ గా మారింది. ఏకంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ను అలాంటి ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది. అసలు ఇది నిజమా అబద్దమా అని తెలిసేలోపే మరొక రూమర్ కన్ఫ్యూజన్ కు గురి చేస్తోంది.

   రాజమౌళి RRR వలన..

  రాజమౌళి RRR వలన..

  రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయమే. RRR సినిమా కంటే ముందే వీరు రెగ్యులర్ గా కలుసుకుంటూ ఉండేవారు. అలాగే మహేష్ బాబు కూడా ఈ స్టార్స్ తో కలిసి పార్టీలు చేసుకునేవారు. చాలాసార్లు వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక రాజమౌళి RRR వలన ఆ బాండింగ్ మరింత దగ్గరయ్యింది.

  బాలకృష్ణ - చిరంజీవి

  బాలకృష్ణ - చిరంజీవి

  పెద్ద స్టార్స్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. బాలకృష్ణ - చిరంజీవి వంటి వారు సినిమా చేస్తే అప్పట్లో ఒక రేంజ్ లో ఉండేది. కానీ ఎవరు ధైర్యం చేయలేకపోయారు. ఇక ఇప్పుడు వారి కొడుకులు మాత్రం కలిసి సినిమా చేస్తుండడం అభిమానుల్లో స్నేహ బలాన్ని పెంచుతోంది.

  ఎన్టీఆర్ - రామ్ చరణ్ చర్చలు

  ఎన్టీఆర్ - రామ్ చరణ్ చర్చలు

  ఎవరైనా సరే బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పుడు ఒకరికొకరు పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం కామన్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కూడా అనేక విషయాలని అభిప్రాయాలను పంచుకుంటారని తెలుస్తోంది. విషయం ఏదైనా సరే ఒక నార్మల్ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్లే ఉంటుందని RRR యూనిట్ ద్వారా తెలిసింది. షూటింగ్ లోనే కాకుండా బయట వారిమద్య సంభాషణలు గంటల తరబడి కొనసాగుతాయట.

  పొలిటికల్ ప్రశ్న

  పొలిటికల్ ప్రశ్న

  ఇక రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ తో పొలిటికల్ గురించి ప్రశ్న అడిగినట్లు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ తో పాటు పొలిటికల్ గా కూడా సంబంధాలు ఉన్నవారే. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం కోసం ప్రచారాలు నిర్వహించగా రామ్ చరణ్ కూడా అలా అలా తండ్రి, బాబాయ్ పాలిటిక్స్ ను టచ్ చేసిన అనుబంధం ఉంది.

  ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై రామ్ చరణ్ కామెంట్

  ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై రామ్ చరణ్ కామెంట్

  ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మొదటి ఎపిసోడ్ కు మొదటి గెస్ట్ గా రామ్ చరణ్ వచ్చినట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే గేమ్ లో భాగంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ను ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ప్రశ్నను అడుగుతాడట. ఇక ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు అని సందేహం వ్యక్తం చేస్తాడట. అలా కొన్ని నిమిషాల రాజకీయ సంభాషణ కొనసాగుతుందట.

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
  అప్పుడే సీన్ కట్ చేశారా?

  అప్పుడే సీన్ కట్ చేశారా?

  అయితే ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ ను ఏ మాత్రం టచ్ చేయడం లేదు. అందుకే రామ్ చరణ్ తో జరిగిన సంభాషణను ఎడిటింగ్ లో లేపేయమని ఆర్డర్ వేసినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని రామ్ చరణ్ అయితే 25లక్షలు గెలుచుకున్నారు.. అని బలమైన టాక్ వస్తోంది. మరికొన్ని రోజుల్లో మొదలు కానున్న ఈ షో ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.

  English summary
  It is a well known fact that Bahubali is the film that has the true meaning of the word Pan India. The upcoming RRR movie with the same team is also going to take the Pan India range to another level. Songs stand as another weapon for any movie. A music director like Keeravani has decided to release each song in a range. While releasing the first Dosti song in 5 languages, Singer set the language.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X