»   » ‘జన సేన’ మన పార్టీ అంటూ రామ్ చరణ్ సర్‌ప్రైజ్?

‘జన సేన’ మన పార్టీ అంటూ రామ్ చరణ్ సర్‌ప్రైజ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించిన ఓ ఆసక్తికర వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజల తరుపున పోరాటం చేస్తున్న బాబాయ్ పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నాడని, ఆయన స్థాపించిన జనసేన పార్టీలో రామ్ చరణ్ చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019 నాటికి మెగాస్టార్ చిరంజీవి కూడా పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు.

మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం...ఇటీవల రామ్ చరణ్ అభిమానులతో ఇంటాక్ట్ అయిన సందర్భంలో ‘జనసేన' పార్టీ మన సొంత పార్టీ అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ సభకు హాజరైన అభిమానులు జై పవన్, జై జనసే అంటూ నినాదాలు చేసారని, రామ్ చరణ్ కూడా తిరిగి అవే నినాదాలు అందరి సర్ ప్రైజ్ చేసినట్లు టాక్. ‘జన సేన మన పార్టీ. మన బాబాయ్ లీడ్ చేస్తున్న పార్టీ' అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Ram Charan supports Janasena Party

గతంలో రామ్ చరణ్ తన మద్దతు ఎప్పటికీ నాన్నకే అని స్పష్టం చేసారు. రాజకీయాలు వేరు, కుటుంబం వేరు అని కూడా వ్యాఖ్యానించాను. మరి రామ్ చరణ్ లో ఉన్నట్టుండి ఈ మార్పు ఏమిటి? అంటూ అంతా ఆశ్చర్య పోతున్నారు. ఏది ఏమైతేనే మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే పార్టీ తాటిపైకి వచ్చే సంకేతాలు వస్తుండటం అభిమానుల్లో ఉత్సాహాన్నినింపింది.

English summary
A newspaper report stated that at a recent meeting with fans, Ram Charan openly claimed that Jana Sena is their own party. When few fans started shouting "Jai Pawan, Jai Jana Sena", Charan shot back, "Jai Jai Jana Sena", pushing fans into surprise. Later he added in a warmer tone, "Jana Sena is our own party. Mana baabai is leading it. That's for us. Is it not?", asked Charan, the report adds.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu