For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజమా : సోనాక్షి సిన్హా...ఆ తెలుగు హీరో ప్రక్కన

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రస్తుతం 'లింగా' చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న సోనాక్షి సిన్హా మరో తెలుగు సినిమా కమిటయ్యిందని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఆ హీరో మరెవరో కాదు రామ్ చరణ్ తేజ. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఆమెను హీరోయిన్ గా అడిగినట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. అయితే ఆమె డేట్స్ అందుబాటులో ఉండి ఎప్పుటి నుంచి ఎడ్జెస్ట్ చేస్తారనే విషయం మీద ఆమెను తీసుకుంటారని తెలుస్తోంది.

  ఫేస్‌బుక్ ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి

  'దబాంగ్‌' తర్వాత నా కెరీర్‌లో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోయిన 'రౌడీరాథోర్‌'కి మూలం మీ 'విక్రమార్కుడు' సినిమానే. అలాగే 'సన్‌ ఆఫ్‌ సర్దార్‌'... తెలుగు 'మర్యాద రామన్న' రీమేక్‌. 'లింగా' తర్వాత నేనిప్పుడు నటిస్తున్న 'దేవర్‌'.. తెలుగులో చరిత్ర సృష్టించిన 'ఒక్కడు' కథ నుంచి అల్లినదే. అందుకే ఈ తెలుగు సినిమాలన్నీ మళ్లీమళ్లీ చూడాల్సొచ్చింది. భాష కూడా ఎంతోకొంత ఒంటపట్టింది అంటూ సోనాక్షి వివరించింది.

  Ram Charan to romance Sonakshi Sinha!

  అందరూ శ్రీను వైట్లతో ప్రాజెక్టు ఉండదు...అనుకున్న సమయంలో శ్రీను వైట్ల స్క్రిప్టుని ఫైనలైజ్ చేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథని అందిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. డి.వివి దానయ్య ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

  మరో ప్రక్క...

  కృష్ణవంశీ తో చేసిన ‘గోవిందుడు అందరివాడేలే' తర్వాత రామ్ చరణ్ ఏ చిత్రమూ కూడా సైన్ చేయలేదు. శ్రీను వైట్లతో అనుకున్న చిత్రం ఇంకా ఫైనల్ కాలేదు. కోన వెంకట్,గోపీ మోహన్ తయారు చేసిన స్క్రిప్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ డైరక్టర్ ని ఫైనలైజ్ చేయలేదు. గౌతమ్ మీనన్ తో చిత్రం అనుకున్నారు కానీ అది ఆయన అజిత్ చిత్రం పూర్తయ్యే దాకా ప్రారంభించరు. దాంతో ఇప్పుడు మరో కన్నడ రీమేక్ పై రామ్ చరణ్ కన్నేసినట్లు సమాచారం.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  ‘గోవిందుడు అందరివాడేలే' తర్వాత ఇప్పటికే పలువురి దర్శకులతో కథాచర్చల్లో పాల్గొన్న చరణ్ దేనిపైనా పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. గోవిందుడు కూడా అనుకున్న ఫలితం ఇవ్వకపోవటంతో ఓ రీమేక్‌పై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. కన్నడంలో ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన ‘బహద్దూర్' చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

  ధ్రువ్ సర్జా, రాధకా పండిట్ జంటగా నటించిన ఈ చిత్రానికి చేతన్‌కుమార్ దర్శకత్వం వహించారు. పక్కా మాస్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ బాక్సాఫీస్‌ను సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను ఇటీవలే చూసిన రామ్‌చరణ్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. . ఈ సినిమాకు సంబంధించిన హక్కులకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

  ఈ చిత్రం కథేమిటంటే..

  ఓ పెద్ద బహుదూర్ వంశానికి చెందిన హీరో అశోక్(ధ్రువ సర్జా) చుట్టూ కథ తిరిగుతుంది. అతను మైసూర్ వచ్చి తన ఐడింటిటీ దాచిపెట్టి తనెవరో చెప్పకుండా తనకు తగ్గ అమ్మాయిని వెతుకుతూంటారు. అప్పుడు అతనికో అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె అంజలి(రాధికాపండిట్). ఆమె తన తండ్రికి మాట ఇచ్చి ఉంటుంది. చదువు పూర్తైన తర్వాత ఎవరిని చూపెడితే వారినే పెళ్లి చేసుకుంటానని. ఈ విషయం తెలియని అశోక్ ఆమెతో ప్రేమలో పడి..ఆమె వెనక పడి, అల్లరి చేసి, చివరికి ఆమె చేత ఓకే చేయించుకుంటాడు.

  ఈ లోగా ఆమెకు ఇంటి నుంచి కబురు వస్తుంది. ఇంటికి వెళ్లగానే తండ్రి ఆమెతో..నీకు నా ఆత్మీయ స్నేహితుడు అప్పాజీ కుమారుడు శంకర్ తో పెళ్లి నిశ్చయం చేసానని చెప్పి, ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చేసేస్తాడు. తండ్రికి ఇచ్చిన మాట కాదనలేని అంజలి....ఇటు ఈ విషయం తెలుసుకున్న అశోక్ ఏం చేసారు. వారిద్దరి వివాహం ఎలా జరిగింది. ఈ కథలో అప్పాజీ గౌడ ఏం విలనీ చేసి, ఈ ప్రేమకుల మధ్య ఎడబాటు సృష్టించాడు వంటి ఆసక్తికరమైన అంశాలతో కథ నడుస్తుంది.

  English summary
  Ram Charan will be romancing Sonakshi Sinha in his next film. Sonakshi, who is making debut in South Cinema with Rajanikanth's Lingaa expressed her wish to do more films in Tamil and Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X