»   » రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్, ఉపాసన త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. వారి కలల సొంతిల్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఉపాసన ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అంటే త్వరలోనే చెర్రీ వేరు కాపురం పెట్టబోతున్నారన్నమాట.

ఇటీవల ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ... 'మా అభిరుచికి తగిన విధంగా సొంత ఇంటిని నిర్మించుకుంటున్నాం. ఇంకా నిర్మాణం జరుగుతుంది. నేను అన్నీ ఖశ్చితంగా ప్లాన్ చేసే మనిషిని. అన్ని పద్దతి ప్రకారం జరగాలి. అన్నీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాను... సొంతింట్లోకి మారిన తర్వాతే ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటుందని ఉపాసన తెలిన సంగతి తెలిసిందే.

అయితే వారి కలల సౌధం కోసం ఈ జంట ఖర్చుపెడుతున్న వివరాలు బయటకు వచ్చాయి.

ఇంటర్నేషనల్ రేంజిలో

ఇంటర్నేషనల్ రేంజిలో

రామ్ చరణ్, ఉపాసన తమ సొంతింటిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఇంటి డిజైనింగ్, ఇంటీరియర్ వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్చర్లతో డిజైన్ చేయించారట. ఈ ఇంటి కోసం వాడే పేయింట్ కూడా చాలా ఖరీదైనది వాడుతున్నారని సమాచారం.

రూ. 80 కోట్ల ఖర్చు?

రూ. 80 కోట్ల ఖర్చు?

ఈ ఇంట్లో సకలసౌకర్యాలు ఉండబోతున్నాయి. జిమ్, స్విమ్మింగ్ ఫూల్, టెన్నిస్ కోర్ట్ ఇలా సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఈ ఇంటి కోసం రూ. 80 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఇద్దరూ బాగా సంపాదించే వారే కాబట్టి సొంత ఇంటి కోసం ఇంత ఖర్చు పెట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

ఫ్యామిలీ ప్లానింగ్

ఫ్యామిలీ ప్లానింగ్

పిల్లలు కనే విషయంలో ఇంకాస్త సమయం తీసుకోవాలనుకుంటున్నాం. సొంతింట్లోకి మారిన తర్వాత ఆ విషయం గురించి ఆలోచిస్తాం. పిల్లలు కనే విషయంలో పక్కా ప్లానింగుతో ఉండాలనుకుంటున్నాను. చరణ్ నాతో కొన్ని రోజులు ఉండాలి.... అన్నీ అలా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని ఉపాసన తెలిపారు.

చెర్రీకి సెట్ కావనే విమర్శలు, విడాకులు, పిల్లలు కనడం, చిరు 150పై... ఉపాసన స్పందన

చెర్రీకి సెట్ కావనే విమర్శలు, విడాకులు, పిల్లలు కనడం, చిరు 150పై... ఉపాసన స్పందన

చెర్రీకి సెట్ కావనే విమర్శలు, విడాకులు, పిల్లలు కనడం, చిరు 150పై... ఉపాసన స్పందన (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

English summary
Film Nagar source said that, Ram Charan and Upasana are spending 80 cr for their own new house in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu