»   » రామ్ చరణ్-ఉపాసనపై రూమర్స్: నిజం కావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్!

రామ్ చరణ్-ఉపాసనపై రూమర్స్: నిజం కావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన క్లోజ్ ఫ్రెండ్ ఉపాసనను ఐదేళ్ల క్రితం పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇద్దరూ ఎంతో అన్యోన్యమైన దాంపత్యం సాగిస్తున్నారు. అయితే పెళ్లయి ఇన్నేళ్లయినా తమకు ఓ బుల్లి వారసుడిని ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగానే ఉన్నారు.

ఆ మధ్య రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్ సంతోష పడ్డారు... కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. తాజాగా అలాంటి వార్తలే మళ్లీ ప్రచారంలోకి వచ్చాయి. ఈ సారైనా ఈ వార్తలు నిజం కావాలని కోరుకుంటున్నారు అభిమానులు.

రామ్ చరణ్ ఏమంటున్నారు?

రామ్ చరణ్ ఏమంటున్నారు?

పిల్లల్ని కనే ఉద్దేశం ఇప్పుడే లేదని, మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని అంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. ఇంకా చిన్న పిల్లాడనని నేను భావిస్తుంటాను. ఇంకా మెచ్యురిటీ రావాలి. పెద్దవాడినవ్వాలి. నన్ను నేను హ్యాండిల్ చేసుకొనే శక్తి వచ్చినపుడు పిల్లల గురించి ఆలోచిస్తాను. ఇప్పటికిప్పుడు అలాంటి ప్లాన్స్ లేవు అని తేల్చి చెప్పారు. రామ్ చరణ్ అలా చెప్పినప్పటికీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు.

 ఉపాసన ఏమంటోంది?

ఉపాసన ఏమంటోంది?

కొన్ని రోజుల క్రితం ఉపాసన ఈ విషయమై స్పందిస్తూ.....నా బరువు తగ్గడానికి నేను చాలా సమయం వెచ్చించాను. మల్లీ ఇపుడు కూర్చుని బరువు పెరగదల్చుకోలేదు. మేము ఇంకా చిన్న వయసులోనే ఉన్నాం. నాకు నిజంగా పిల్లలు కావాలనుకుంటే నా వెనక మొత్తం అపోలో ఉంది. నేను పిల్లల్ని కంటాను. కానీ అది మా వ్యక్తిగతం. అది తర్వాత ఉంటుంది. ఇది ప్రపంచం మొత్తం తెలియాలనుకోను. అది మా పర్సనల్. కొన్ని అలాగే పర్సనల్ గా ఉంచాలి. అలాగే ఉంచుతాను... అంటూ ఇప్పట్లో పిల్లల్ని కనే ఉద్దేశ్యం లేదని చెప్పకనే చెప్పింది ఉపాసన.

గర్భం దాల్చడం అంటే భయం

గర్భం దాల్చడం అంటే భయం

మీకు గర్భం, పిల్లలకు జన్మనివ్వడం అంటే భయమటకదా.. అనే ప్రశ్నకు ఉపాసన స్పందిస్తూ అవును నాకు చాలా భయం. మళ్లీ బరువు పెరుగుతాను. అంతే కాదు... మా ఇల్లు కూడా ఇంకా సిద్ధంగా లేదు. ఇంకా నిర్మాణం జరుగుతుంది. అది కూడా కావాలి. నేను అన్నీ ఖశ్చితంగా ప్లాన్ చేసే మనిషిని. అన్ని పద్దతి ప్రకారం జరగాలి. అన్నీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చరణ్ నాతో కొన్ని రోజులు ఉండాలి. అన్నీ అలా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని ఉపాసన తెలిపారు. దీన్ని బట్టి చెర్రీ, ఉపాసన త్వరలో వేరే ఇంట్లో కాపురం పెడతారని, సొంతింట్లోనే పిల్లలను కంటారని తెలుస్తోంది.

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్, ఉపాసన తమ సొంతింటిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఇంటి డిజైనింగ్, ఇంటీరియర్ వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్చర్లతో డిజైన్ చేయించారట. ఈ ఇంటి కోసం వాడే పేయింట్ కూడా చాలా ఖరీదైనది వాడుతున్నారని సమాచారం.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Rumors were doing the rounds that Ram Charan wife Upasana is pregnant. Still, it is unclear an official announcement is awaited.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu