For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో మల్టీస్టారర్‌ను లైన్‌లో పెట్టిన నాగార్జున: చైతూ, అఖిల్ ఔట్.. డ్రీమ్ ప్రాజెక్టులో ఊహించని హీరోలు!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకడు. పేరుకు సీనియర్ హీరోనే అయినా.. లుక్స్‌లో కుర్రాళ్లకు ధీటుగా కనిపిస్తుంటాడు. ఆరు పదుల వయసులోనూ సత్తా చాటుతూ ఎంతో స్పీడుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో వేగం తగ్గించిన ఆయన.. ఆ మధ్య 'మన్మథుడు 2'తో భారీ పరాజయాన్ని చవి చూశాడు. దీంతో ఈ సారి హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేశాడు. దీని తర్వాత మరో మల్టీస్టారర్ మూవీని లైన్‌లో పెట్టేశాడు. ఇందులో ఊహించని హీరోలు భాగం కాబోతున్నారట. ఆ వివరాలు మీకోసం!

  అందులో నిరాశ.. ఇందులో సూపర్‌గా

  అందులో నిరాశ.. ఇందులో సూపర్‌గా

  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ‘మన్మథుడు 2'. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. దీంతో నాగ్ కెరీర్‌లోనే ఓ డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. ఈ మూవీతో నిరాశ పరిచినప్పటికీ.. బిగ్ బాస్ షోతో మాత్రం నాగ్ అదరగొట్టేశాడు. అందులో హోస్టుగా రాణించిన ఆయన ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.

  పోలీస్ స్టోరీతో రాబోతున్న నాగార్జున

  పోలీస్ స్టోరీతో రాబోతున్న నాగార్జున

  నాగార్జున తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్'. నూతన దర్శకుడు సోలోమన్ దర్శకత్వం తెరకెక్కించిన ఈ సినిమాలో ఆయన ఏఎన్ఐ ఆఫీసర్‌గా నటించాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో దియా మిర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణీ, అలీ రేజా తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కాబోతుంది.

  డ్రీమ్ ప్రాజెక్టును మొదలెట్టనున్నాడు

  డ్రీమ్ ప్రాజెక్టును మొదలెట్టనున్నాడు

  అక్కినేని నాగార్జున - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన'. రెండేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఈ సినిమాకు ‘బంగార్రాజు' అనే టైటిల్‌తో ప్రీక్వెల్‌ను రూపొందించబోతున్నారు. త్వరలోనే నాగార్జున డ్రీమ్ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

   ‘బంగార్రాజు'లో మరో అక్కినేని హీరో

  ‘బంగార్రాజు'లో మరో అక్కినేని హీరో

  ‘బంగార్రాజు' మూవీ కోసం కల్యాణ్ కృష్ణ ఎప్పుడో స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టేశాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇటీవలే ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయి. ఇక, ఇందులో అఖిల్ కానీ, నాగ చైతన్య కానీ నటించాల్సి ఉంది. ఈ విషయాన్ని వాళ్లే పలుమార్లు చెప్పారు.

  ఈ సినిమా నుంచి చైతూ, అఖిల్ ఔట్

  ఈ సినిమా నుంచి చైతూ, అఖిల్ ఔట్

  అఖిల్ ఈ సినిమాలో నటిస్తాడని అప్పట్లో ప్రచారం జరిగినా.. ఆ తర్వాత అతడు చేయడం లేదని క్లారిటీ వచ్చేసింది. కానీ, నాగ చైతన్య మాత్రం ఈ సినిమాలో నటిస్తున్నట్లు స్వయంగా చెప్పాడు. ‘నాన్న, నేను ‘బంగార్రాజు'లో నటించాల్సి ఉంది. నా కోసం స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారు' అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే, ఇప్పుడు అతడు కూడా దీని నుంచి తప్పుకున్నాడట.

  డ్రీమ్ ప్రాజెక్టులో ఊహించని హీరోలు!

  డ్రీమ్ ప్రాజెక్టులో ఊహించని హీరోలు!

  కొడుకులు ఇద్దరూ వాళ్ల వాళ్ల సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడంతో.. ‘బంగార్రాజు'లో మరో హీరోను తీసుకోవాలని నాగార్జున భావిస్తున్నాడట. ఇందుకోసం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో చర్చలు జరపబోతున్నాడని తెలుస్తోంది. అతడు ఓకే అనని పక్షంలో యంగ్ హీరో నాగశౌర్యను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇది మల్టీస్టారర్‌గానే రాబోతుంది.

  English summary
  Akkineni Nagarjuna is going to begin the shoot for his dream project Bangarraju this month. The actor wrapped up the shoot for the upcoming film Wild Dog. Wild Dog was initially planned for a direct OTT release. Netflix reportedly grabbed the streaming rights of the film. But, the film unit is now planning to release the film in theatres on April 2nd. The film is in the post-production activities now.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X