twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రామయ్యా వస్తావయ్యా' ప్రమాదంలో పడినట్లే?

    By Srikanya
    |

    హైదరాబాద్ : పైరసీ సానుభూతితో ఏ ఇబ్బందీలేకుండా ఉద్యమాల హోరు తట్టుకుని అత్తారింటికి దారేది చిత్రం విడుదలై ఘన విజయం నమోదు చేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టీ మరో పెద్ద చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' పైనే ఉంది. ఈ చిత్రం దశరాకు టార్గెట్ చేసారు. అయితే రాత్రికి రాత్రి మారిన రాష్ట్ర పరిస్ధితులు దృష్ట్యా ఈ చిత్రం విడుదల ప్రమాదంలో పడినట్లే అంటన్నారు. తెలంగాణ వాదుల అనుమానాలు... సీమాంధ్రుల ఆందోళనలను పక్కనబెడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసేసింది. జులై 30న సీడబ్ల్యుసీ తీర్మానం చేసినట్లుగానే హైదరాబాద్‌ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణకు పచ్చజెండా వూపింది. దాంతో ఇప్పుడు సీమాంధ్ర భగ్గుమంటోంది.

    ఈ విభజన తీర్మానం ఆమోద ముద్రతో సీమాధ్రలో ఉద్యమం తీవ్రరూపాన్ని దాల్చింది. అనేక చోట్ల రాస్తారోకోలు, ప్రదర్శనలు చేశారు. నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో శుక్రవారం నుంచి 72 గంటల పాటు ఔట్‌ పేషెంట్‌(ఓపీ) బంద్‌కు పిలుపునిచ్చింది. దాంతో 'రామయ్యా వస్తావయ్యా' వచ్చేనాటికి పరిస్ధితులు చక్కబడతాయా లేదా అనేది సినిమావారికి సందేహం మారింది. పరిస్ధితులు మారకపోతే అది కలెక్షన్స్ పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. దాంతో వాయిదా వేసే అవకాసం ఉందంటున్నారు.

    ఇక ప్రతీ సినిమాలోనూ కొత్త ఎన్టీఆర్‌ కనిపించాడు. తొడగొట్టాడు, గొడ్డలి పట్టాడు, కన్నీరు కార్చాడు, నవ్వాడు, నవ్వించాడు, స్లిమ్‌ అయ్యాడు, లవర్‌బోయ్‌లా మారాడు - ఎన్నో చేశాడు. తనని తాను మార్చుకొన్న ప్రతిసారీ ఎన్టీఆర్‌కి విజయం దక్కింది. ఇప్పుడు 'రామయ్యా... వస్తావయ్యా'లోనూ ఎన్టీఆర్‌లో ఛేంజ్‌ కనిపిస్తోంది. ఓ కాలేజీ కుర్రాడిలా మారిపోయాడు. అభిమానుల బిరుదుకి తగ్గట్టు 'యంగ్‌ టైగర్‌'లా మారిపోయాడు.

    సమంత, శ్రుతిహాసన్‌ హీరోయిన్స్ గా నటించారు. వీరిద్దరూ ఈ సినిమాకి సరికొత్త గ్లామర్‌ సొబగులు అందిస్తారనడంలో సందేహం లేదు. 'రామయ్యా వస్తావయ్యా' ట్రైలర్‌ చూసి... ''వినాయక్‌, నేనూ ఎన్టీఆర్‌ని టైగర్‌లా చూపించాం, వంశీపైడిపల్లి యంగ్‌ లుక్‌ ఇచ్చాడు. హరీష్‌ శంకర్‌ యంగ్‌ టైగర్‌లా మార్చాడు'' అంటూ రాజమౌళి కూడా కితాబిచ్చేశారు.
    ఎన్టీఆర్‌లో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఎవరైనా ఇట్టే లొంగిపోతారు. ఒక్కసారి ఎన్టీఆర్‌తో పనిచేస్తే చాలు మళ్లీ మళ్లీ చేయాలనుకొంటారు. హరీష్‌ శంకర్‌ పరిస్థితీ ఇలాగే ఉంది. ''ఎన్టీఆర్‌లాంటి నటుడు మళ్లీ పుట్టడు. డాన్స్‌లు చేయడంలో, సంభాషణలు పలకడంలో ఆయన్ని మించిన హీరో లేడు..'' అని మురిసిపోతున్నారు హరీష్‌.

    'గబ్బర్‌సింగ్‌' తరవాత హరీష్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. కాబట్టి అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తమన్‌ అందించిన పాటలు, కట్‌ చేసిన ట్రైలర్‌ ఈ సినిమాపై పెట్టుకొన్న ఆశల్ని రెట్టింపు చేశాయి. ''మీరు ఎన్ని అంచనాలు పెట్టుకొనైనా థియేటర్లకు రండి. సినిమా చూశాక అందరూ 'ఇది సూపర్‌హిట్‌' అంటారు. ఆ గ్యారెంటీ నాది..'' అని నిర్మాత దిల్‌రాజు కూడా భరోసా ఇస్తున్నారు.

    English summary
    Telangana state was approved by Union cabinet today (October 3, 2013). And Seemandhra erupted in protest soon after the announcement. Political parties and APNGO's have called for a 72-hour bandh across Andhra Pradesh against the decision. So Tollywood in a fix again. If the turbulence continues, there is chance of new releases including Ramayya Vastavayya to get postponed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X