For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గోవాలో రమ్యకృష్ణ.. పూరి జగన్నాథ్ సెంటిమెంట్.. రొమాంటిక్ అప్‌డేట్

  |

  సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్‌కి ప్రధాన పాత్ర ఉంటుందనే సంగతి తెలిసిందే. చిత్ర షూటింగ్ మొదలుకొని నటీనటులు, రిపీట్ కాంబినేషన్స్ లాంటి వాటిలో ఎక్కువగా సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు కొందరు దర్శకనిర్మాతలు. అలాంటి వారిలో ఒకరు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన తాజా సినిమా రొమాంటిక్ కోసం ఓ సెంటిమెంటల్ లొకేషన్‌లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణతో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారట. ఆ వివరాలేంటో చూద్దామా..

  అప్పుడు దర్శకుడిగా.. ఇప్పుడు నిర్మాతగా

  అప్పుడు దర్శకుడిగా.. ఇప్పుడు నిర్మాతగా

  ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. అయితే అప్పుడు దర్శకుడిగా అయితే.. ఇప్పుడు నిర్మాతగా. ఎంతైనా మల్టీటాలెంటెడ్ పర్సన్ కదా!. పూరి జగన్నాథ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోంది 'రొమాంటిక్' మూవీ. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు పూరి.

  పూరి తనయుడు హీరో

  పూరి తనయుడు హీరో

  తన కొడుకు ఆకాష్ పూరీని ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కించి స్టార్ హీరోని చేయాలని తాపత్రయ పడుతున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ మేరకు తన స్వీయ దర్శకత్వంలో కొడుకు హీరోగా పెట్టి 'మెహబూబా' సినిమా రూపొందించారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో మరో దర్శకుడికి తన కొడుకు బాధ్యతను అప్పజెప్పి నిర్మాతగా రొమాంటిక్ సినిమా తీస్తున్నాడు.

  ఆకాష్ పూరి- కేతిక శర్మ రొమాంటిక్ డోస్

  ఆకాష్ పూరి- కేతిక శర్మ రొమాంటిక్ డోస్

  అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమానే 'రొమాంటిక్'. ఈ సినిమాలో ఆకాష్ పూరి హీరోగా నటిస్తుండగా అందాల భామ కేతికశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే పేరుకు తగ్గట్టే ఈ సినిమాలో రొమాంటిక్ డోస్ మరింత ఉంటుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ద్వారా తెలిసింది.

  గోవాలో షూట్.. రమ్యకృష్ణతో పూరి

  గోవాలో షూట్.. రమ్యకృష్ణతో పూరి

  ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారు పూరి. తాజాగా జరుగుతున్న గోవా షెడ్యూల్‌లో ఆమె జాయిన్ అయ్యారనేది తాజా సమాచారం. ఈమెపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. నెల రోజుల పాటు జరిగే ఈ షూటింగులో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒకటి రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నారు.

  పూరి జగన్నాథ్ సెంటిమెంట్.. ఈ సారి ఖాయమే

  పూరి జగన్నాథ్ సెంటిమెంట్.. ఈ సారి ఖాయమే

  తన సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ గోవాలో తీయడమనేది పూరి సెంటిమెంట్. అందుకే ఆ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ 'రొమాంటిక్' సినిమాలో కొన్ని సీన్స్ కూడా అక్కడే ప్లాన్ చేశాడు పూరి జగన్నాథ్. కొడుకు సినిమాకు ఈ సెంటిమెంట్ బాగా కలిసి రావాలని ఆయన తాపత్రయ పడుతున్నారట. మరోవైపు ఈ ప్రేమకథా చిత్రంతో హీరోగా ఆకాశ్ నిలదొక్కుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  Cine Box : Suriya’s Aakasam Nee Haddura First Look Is Out || 'రూలర్’లో ఆ సీన్‌కు పునకాలు ఖాయమట.!
  టాప్ లెస్‌ బ్యూటీ.. కేతిక శర్మ

  టాప్ లెస్‌ బ్యూటీ.. కేతిక శర్మ

  పూర్తి స్థాయిలో యూత్‌‌ను టార్గెట్ చూస్తూ పూరీ తరహా ప్రేమ కథా చిత్రంగా రొమాంటిక్ సినిమా రూపొందుతోందని తలుస్తోంది. పూరి జగన్నాథ్‌ సూపర్ హిట్ మూవీ 'ఇడియట్' తరహాలోనే ఈ జనరేషన్ అభిరుచికి తగినట్టుగా 'రొమాంటిక్' రూపొందిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే హీరోయిన్ కేతికశర్మను టాప్ లెస్‌గా వెనుక నుంచి చూపించి అందరి దృష్టినీ లాగేశారు పూరీ.

  English summary
  Akash Puri's Romantic movie shooting successfully going on. Presently this movie schedule is running in Goa. Ketika Sharma is the heroine, and sinor heroine Ramya Krishnan playing lead role. Puri Jagannadh is the producer and Anil is the Director for this movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X