For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  God Father: చిరంజీవి చెల్లెలిగా పవర్‌ఫుల్ లేడీ.. అప్పుడు జోడీగా ఇప్పుడు ఇలా

  |

  గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఆయన పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఇది పూర్తి కాకముందే మరో మూడు ప్రాజెక్టులను ప్రకటించి అందరికీ షాకిచ్చారు. దీంతో ఆయన ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

  Unstoppable with NBK: రెండు ఎపిసోడ్లకే ఆగిపోయిన బాలకృష్ణ షో.. అసలు కారణం చెప్పిన ఆహా

  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రాల్లో 'గాడ్ ఫాదర్' ఒకటి. మలమాళ చిత్రం 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయిపోయింది. అంతేకాదు, ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తైపోయింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇందులో ముఖ్యమైన పాత్రలను పోషించే నటీనటుల ఎంపికపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే కొందరిని సెలెక్ట్ చేసుకున్నారు కూడా.

   Ramya Krishnan Play Chiranjeevi Sister Role in God Father Movie

  మలయాళంలో 'లూసీఫర్'లో అసలు హీరోయిన్ పాత్రే ఉండదు. అయితే, తెలుగు నేటివిటీకి అనుగుణంగా చిరంజీవి చేసే సినిమాలో ఆ రోల్‌ను యాడ్ చేశాడు దర్శకుడు మోహన్ రాజా. ఇక, ఈ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, ఈ పాత్ర తర్వాత ఇందులో మరో ముఖ్యమైన రోల్ కూడా ఉంది. అదే హీరో సోదరి పాత్ర. మలయాళంలో ఈ రోల్‌ను మంజూ వారియర్ చేశారు. అయితే, తెలుగులో మాత్రం దీన్ని ఎవరు చేస్తారన్న దానిపై చాలా రోజులుగా ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

  బ్రా కూడా లేకుండా షాకిచ్చిన పాయల్: వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్.. వామ్మో ఇది మరీ దారుణం

  తాజా సమాచారం ప్రకారం.. 'గాడ్ ఫాదర్' మూవీలో అత్యంత ముఖ్యమైన హీరో చెల్లెలి పాత్రను సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ చేస్తుందట. ఇప్పటికే దీనికి సంబంధించి ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా ఈ సీనియర్ హీరోయిన్ తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గాడ్ ఫాదర్' మూవీతో ఆమె చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. గతంలో వీళ్లిద్దరూ కలిసి కొన్ని చిత్రాల్లో జంటగానూ నటించారు.

  పూర్తి స్థాయిలో రాజకీయ నేపథ్యంతో సాగే 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా నటిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టారు. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందించబోతున్నాడు. సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే.

  English summary
  Megastar Chiranjeevi doing God Father Under Mohan Raja Direction. Ramya Krishnan to play Chiranjeevi Sister Role in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X