»   » ఆ దర్శకుడితో రానా కుదరదని చెప్పేశాడా?

ఆ దర్శకుడితో రానా కుదరదని చెప్పేశాడా?

Subscribe to Filmibeat Telugu

ఆరడుగుల ఆజానబాహుడు రానా విభిన్నమైన చిత్రాలతో తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. బాహుబలి చిత్రంలో బల్లాలుడిగా క్రూరమైన పాత్రకు కూడా వెనకడుగు వేయలేదు. హీరోగా కూడా రానా వైవిధ్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నాడు. నేనేరాజు నేనే మంత్రి చిత్రంలో రాజకీయ నాయకుడిగా నటించి మెప్పించాడు. ఘాజి చిత్రంలో నేవి అధికారిగా అదరగొట్టాడు. తాను చేసే ప్రతి చిత్రానికి ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నాడు. రానా ప్రస్తుతం హాథీ మేరె సాథీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ, తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతోంది.

Rana rejects director Krishna Vamsi script

కాగా ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశి కథని రానా రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కృష్ణ వంశి రానా కోసం అనుకున్న స్టోరీ లైన్ అతడికి వివరించాడట. దానిని డెవలప్ చేయమని రానా కృష్ణవంశీకి గతంలో చెప్పినట్లు తెలుస్తోంది. పూర్తి కథతో ఇటీవల రానాని కృష్ణవంశీ కలిశాడని, కానీ కృష్ణ వంశి తన కథతో రానాని మెప్పించలేకపోయాడని తెలుస్తోంది. తనకు కథ నచ్చకపోవడంతో సినిమా చేయలేనని రానా కృష్ణవంశీకి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో కృష్ణవంశీ మరో హీరోని వెతుక్కునే పనిలో ఉన్నాడట. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Rana rejects director Krishna Vamsi script. Now the diretor is busy finding new hero
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X