ఉయ్యాలవాడలో.... ‘భళ్లాలదేవుడు’?
చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా త్వరలో రాబోతున్న చిత్రంలో రానా కీలకమైన పాత్రలో నటించబోతున్నాని తెలుస్తోంది.
హైదరాబాద్: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రికార్డ్ బ్రేకింగ్ మూవీ 'బాహుబలి'లో భళ్లాలదేవుడిగా తనదైన విలనిజాన్ని పండించి భారతసినీ ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపోయే పాత్ర చేసిన రానా దగ్గుబాటి.... త్వరలో మెగాస్టార్ మూవీలో నటించబోతున్నట్లు సమాచారం.
చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా త్వరలో రాబోతున్న చిత్రంలో రానా కీలకమైన పాత్రలో నటించబోతున్నాని తెలుస్తోంది. అయితే రానా ఏ పాత్రలో కనిపించబోతున్నాడనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు.

రామ్ చరణ్ పట్టుబట్టి మరీ
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని స్వయంగా రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు. రానా తన బెస్ట్ ఫ్రెండ్ కావడం, బాహుబలిలో రానా పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో రానాతో ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ చేయించాలని ప్లాన్ చేసాడట.

అద్భుతంగా ఉంది: చిరు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పోస్టర్

‘కొణిదెల ప్రొడక్షన్స్’ తొలి వార్షికోత్సవ సంబరం (ఫోటోస్)

‘పేరంటాల పల్లి’లో సందడి చేసిన రామ్ చరణ్-ఉపాసన (ఫోటోస్)
chiranjeevi rana ram charan uyyalawada narasimha reddy చిరంజీవి రానా రామ్ చరణ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి


Click it and Unblock the Notifications