»   » బ్రహ్మోత్సవం: రావు రమేష్ షాకింగ్ రెమ్యూనరేషన్!

బ్రహ్మోత్సవం: రావు రమేష్ షాకింగ్ రెమ్యూనరేషన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో బాగా పాపులర్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్. తండ్రి రావు గోపాలరావు వారసత్వంతో నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన రావు రమేష్ అనతి కాలంలోనే టాప్ రేంజికి ఎదిగాడు. తాజాగా రావు రమేష్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది.

తొలి నాళ్లలో రోజుకు రూ. 5 వేల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయిన నుండి ప్రస్తుతం రోజుకు రూ. 4 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘బ్రహ్మోత్సవం' సినిమా కోసం ఏకంగా 36 రోజులు బుక్ చేసుకున్నాడని టాక్. డేట్స్ ప్రకారం చూస్తే రూ. 1.44 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాలి. అయితే రూ. 1 కోటి రెమ్యూనరేషన్ ఇచ్చేలా డీల్ కుదిరినట్లు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల ప్రతి సినిమాలోనూ రావు రమేష్ కు ముఖ్య పాత్ర ఉంటుంది.

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిస్ సమంత మూడోసారి మహేష్ బాబుతో నటించే అవకాశం దక్కించుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చాందినీ చౌదరికి మహేష్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ‘బ్రహ్మోత్సవం' సినిమాలో మహేష్ బాబుతో కలిసి చాందిని చౌదరి స్టెప్స్ వేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సాంగ్ షూటింగ్ పూర్తయింది. మహేష్ బాబుతో నటించడంతో తనకు మున్ముందు మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావిస్తోంది.

Rao Ramesh shocking Remuneration?

పీవీపీ బ్యాన‌ర్‌పై పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ ‘బ్రహ్మోత్సవం' సినిమా నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు మహేష్ బాబుకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో హిట్ అందించిన దర్శకుడు కావడంతో ‘బ్రహ్మోత్సవం' సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ చిత్రం ఏప్రియల్ 7,2016న విడుదల చేయటానికి నిర్ణయంచినట్లు సమాచారం. అలాగే మార్చి నెలాఖరకు చిత్రానికి సంభందించిన అన్ని పనలు పూర్తి చేయాలని దర్శక,నిర్మాతలు ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. సత్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, కళ: తోట తరణి.

English summary
Srikant Addala has close association with Rao Ramesh and if reports are to be believed, PVP Cinema blocked 36 days call sheets of Rao Ramesh paying him hefty 1 Crore for ‘Brahmotsavam.’
Please Wait while comments are loading...